ప్లీజ్.. నన్ను క్షమించండి.. పాక్ మాజీ పోస్ట్ వైరల్?

praveen
ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా భారత ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ ప్రదర్శనను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు చేసిన సంచలన వ్యాఖ్యలు  ఎంత చర్చనీయాంశంగా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా  అతని మతాన్ని కించపరిచే విధంగా జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మాల్. సిక్కులకు 12 గంటల తర్వాత బౌలింగ్ ఇవ్వకూడదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేయగా.. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. దీనిపై ఎంతోమంది తీవ్రంగా విమర్శలు చేశారు.

భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ సైతం ఈ విషయంపై గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. నీవు నోరు విప్పే ముందు సిక్కుల చరిత్ర తెలుసుకోవాలి. మేము సిక్కులు మీ తల్లులు, సోదరీమణులను ఆక్రమణదారులచే అపహరించినప్పుడు వారిని రక్షించాము, కొంత కృతజ్ఞత కలిగి ఉండండి" అని భజ్జీ అన్నారు. అయితే ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసిన కామ్రాన్  అక్మాల్ ఫై రోజురోజుకి విమర్శలు ఎక్కువ అవుతున్న తరుణంలో ఇక ఈ విషయంపై పాకిస్తాన్ మాజీ స్పందించాడు. తన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతున్నట్లు మరో పోస్ట్ ని సోషల్ మీడియాలో పెట్టాడు.

 సిక్కుల పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెబుతున్నా. నా కామెంట్స్ పట్ల తీవ్రంగా చింతిస్తున్నా. హర్భజన్ సింగ్ తో పాటు సిక్కులందరికీ కూడా క్షమాపణ కోరుతున్న. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కుల పట్ల నాకు ఎంతగానో గౌరవం ఉంది. ఎవరినీ కించ పరచడం నా ఉద్దేశం కాదు. దయచేసినన్ను అర్థం చేసుకొని క్షమించండి అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కామ్రాన్ అక్మల్ క్షమాపణలు చెప్పారు. కాగా న్యూయార్క్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో 18 ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ అద్భుతమైన ప్రదర్శన చేయడంతో.. ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు కామ్రాన్ అక్మాల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: