ప్లీజ్.. పాకిస్తాన్ రండి.. అన్నీ మేము చూసుకుంటాం : PCB

praveen
వరల్డ్ క్రికెట్లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి హై వోల్టేజ్ మ్యాచ్ గా పేరుంది. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతూ ఉంటుంది. కానీ అన్ని దేశాల జట్ల మధ్య జరిగినట్లుగా ఇండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగవు. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది అని చెప్పాలి. దీంతో ఒక జట్టు మరో దేశ పర్యటనకు వెళ్లడం అస్సలు జరగదు. ఈ క్రమంలోనే అటు పాకిస్తాన్ లో నిర్వహించే ఐసీసీ టోర్నిలపై కూడా బీసీసీఐ కాస్త మొండి గానే వ్యవహరిస్తూ ఉంటుంది. గతంలో టీ20 వరల్డ్ కప్ సమయంలో భారత జట్టు అటు పాకిస్తాన్ కి వరల్డ్ కప్ ఆడేందుకు వెళ్లాల్సి వచ్చింది.

 కానీ తాము పాకిస్తాన్ పర్యటనకు వెళ్లే అవకాశం లేదని.. కావాలంటే వరల్డ్ కప్ నుంచి కూడా తప్పుకుంటాము అంటూ బీసీసీఐ ప్రకటించింది. దీంతో చివరికి భారత్ ఆడే మ్యాచ్లను శ్రీలంక వేదికగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 2025లో అటు పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరగబోతుంది. దీంతో మరోసారి భారత జట్టు తమ మ్యాచ్ల కోసం మరో వేదికను ఏర్పాటు చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉంది అని చెప్పాలి. కానీ అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలి అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉండడం గమనార్హం.

 ఇదే విషయంపై మరోసారి రిక్వెస్ట్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదికగా జరిగే  అన్ని మ్యాచ్లలోనూ టీమిండియా పాల్గొనాలి అంటూ పాక్ బోర్డు విజ్ఞప్తి చేసింది. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లాహోర్ లో భారత జట్టు హోమ్ గ్రౌండ్ గా పెట్టుకుంటే పటిష్ట భద్రత కల్పిస్తాం అంటూ తెలిపింది. వేరువేరు గ్రౌండ్లలో ఆడితే ఉండే భద్రత ప్రయాణభారాలు దీంతో తగ్గుతాయని బీసీసీఐకి ప్రతిపాదించింది. అయితే 2025 ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్ లు అన్నింటినీ కూడా పాకిస్తాన్ వేదికగా కాకుండా దుబాయ్ వేదికగా ఆడాలని అటు బీసీసీఐ భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: