IND vs PAK మ్యాచ్.. యువకుడి ప్రాణం తీసింది?

praveen
ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు వరల్డ్ క్రికెట్లో ఎంత క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్లో మాత్రమే కాదు సరిహద్దుల వద్ద కూడా వైరం కొనసాగుతున్న నేపథ్యంలో ఇక ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు పోరు జరిగిన అది ఎంతో ఉత్కంఠ భరితంగా మారిపోతూ ఉంటుంది. అందుకే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్లో దయాధుల పోరు అని పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి.
 అయితే ఇక ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో.. కేవలం ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో మాత్రమే ఇండియా,పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు అవకాశం ఉంది. కాగా ఇటీవల యూఎస్, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా జూన్ 9వ తేదీన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే  నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠగా సాగిన ఈ పొరలో టీమిండియా విజయం సాధించింది  అయితే ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది.

 భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి ఒక వ్లాగ్ తీసిన యూట్యూబర్ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. పాకిస్తాన్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ దేశానికి చెందిన యూట్యూబ్ సాద్ అహ్మద్ కరాచీలో మ్యాచ్ గురించి జనాల అభిప్రాయం తెలుసుకోవాలని అనుకున్నాడు  ఈ క్రమంలోనే ఒక సెక్యూరిటీ గార్డును మ్యాచ్ విషయంపై పదే పదే ప్రశ్నలు అడుగుతూ విసుగెత్తించాడు. దీంతో కోపంతో చెర్రెత్తిపోయిన ఆ సెక్యూరిటీ గార్డ్..తన చేతిలో తుపాకీతో సదరు యువకుడిని కాల్చాడు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలగా.. స్థానికులు అతని ఆసుపత్రికి తరలిస్తుండగా.. చివరికి మార్గమధ్యమంలోనే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: