T20 WC లో.. సరికొత్త చరిత్ర?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ ఇటీవల  ప్రారంభమైంది. జూన్ 2వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నీలో అన్ని మ్యాచ్ లు కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు జరిగిన టి20 లీగ్లలో ఇక ఎంతోమంది ఆటగాళ్లు విధ్వంసకరమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. దీంతో ఈ ప్రపంచ కప్ లో ప్రతి మ్యాచ్ లో కూడా భారీ స్కోర్ నమోదు కావడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఒక్క మ్యాచ్లో కూడా భారీ స్కోర్ లో నమోదు కావడం లేదు. తక్కువ స్కోర్ లే నమోదు అవుతూ ఉండడం.. ఇరు రోజు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీ పోరు సాగుతూ ఉండడం ప్రతి మ్యాచ్ లో జరుగుతూ వస్తుంది.

 ఈ క్రమంలోనే ఇలాంటి క్రికెట్ వుత్ కంటైన ఎంజాయ్ చేసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు తెగ ఆసక్తిని కనపరుస్తున్నారు. ఒక్క మ్యాచ్ కూడా మిస్ చేయకుండా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా.. 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు ఓటమి ఖాయం అనుకుంటుండగా ఇక 119 పరుగుల టార్గెట్ ను కాపాడుకొని విజయం సాధించగలిగింది భారత జట్టు. దీంతో ఇక వరల్డ్ కప్ హిస్టరీలోనే  అత్యంత తక్కువ టార్గెట్ ను కాపాడుకున్న జట్టుగా రికార్డు సృష్టించింది.

 ఇక ఎప్పుడూ ఈ రికార్డును మరో టీం బ్రేక్ చేసింది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవలే అత్యల్ప స్కోరును డిఫరెంట్  చేసుకున్న జట్టుగా సౌత్ ఆఫ్రికా చరిత్ర సృష్టించింది. ఇటీవలే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 114 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టుకు ఓటమి ఖాయం అనుకుంటుండగా ఆ తర్వాత బౌలర్లు విజృంభించడంతో 114 పరుగుల స్కోరుని డిపెండ్ చేసుకొని విజయాన్ని సాధించింది. దీంతో వరల్డ్ కప్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది సౌత్ ఆఫ్రికా జట్టు. అదే సమయంలో బంగ్లాదేశ్ పై వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా కూడా సౌత్ ఆఫ్రికా 9 విజయాలతో రెండవ స్థానంలో ఉంది. 10 విజయాలతో కివిస్ మొదటి స్థానంలో ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: