ఐపీఎల్ ఆడకపోవడమే మంచిదైంది : ఆసీస్ స్పిన్నర్

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఏకంగా వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా ఐపీఎల్ కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇంత క్రేజ్ ఉంది కాబట్టి ipl లో పాల్గొనడానికి.. ప్రపంచ దేశాల నుంచి క్రికెటర్లు అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఐపీఎల్ లో పాల్గొంటే ఒకవైపు ఆదాయంతో పాటు మరోవైపు మంచి అనుభవం కూడా దక్కుతుంది.

 మరోవైపు ఐపీఎల్లో బాగా రాణించిన ఆటగాళ్ల పేరు ప్రపంచ వ్యాప్తంగా కూడా మార్మోగిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎంతో మంది ఆటగాళ్లు దేశం తరపున ఆడటం కంటే ఐపిఎల్ ఆడటానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటే.. కొంతమంది ఆటగాళ్లు మాత్రం ఏకంగా దేశం తరఫున ఆడుటం కోసం.. ఐపీఎల్ నుంచి తప్పుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవల ipl గురించి ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో రెండు కీలకమైన వికెట్లు తీసి జట్టు విజయంలో  తన వంతు పాత్ర పోషించాడు ఆడం జంప.

 ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఐపిఎల్ ఆడక పోవడం తాను తీసుకున్న మంచి నిర్ణయం అని ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా అన్నాడు. ఐపీఎల్ సమయంలో ఎంతగానో అలసటగా ఉన్నాను. చిన్న చిన్న గాయాలు కూడా ఎంతగానో వేధించాయి. అందుకే ఐపీఎల్ ఆడకుండా విశ్రాంతి.. తీసుకొని ఇక ఇప్పుడు వరల్డ్ కప్ సమయానికి పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాను అంటూ ఆడం జంపా చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: