నెక్స్ట్ IND vs PAK మ్యాచ్.. ఎప్పుడంటే?

praveen
హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలుచుకునే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఇక ఈ దాయాదుల పోరు వస్తుంది అంటే చాలు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎన్ని పనులు ఉన్న పక్కన పెట్టేసి ఇక ఈ పోరును చూసేందుకు ఎంతగానో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇక ద్వైపాక్షిక సిరీస్ లో ఈ రెండు టీమ్స్ ఎక్కడ తలపడవు.

 కేవలం ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నిలు వచ్చినప్పుడు మాత్రమే ఇండియా, పాకిస్తాన్ నుంచి మ్యాచ్ చూస్తూ ఉంటాం  అయితే ఇటీవల 20204 t20 వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటికే దయాధుల పోరు ముగిసింది. నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టీమిండియా విజయం సాధించింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అటు పాకిస్తాన్, ఇండియా మధ్య ఈ వరల్డ్ కప్ లో మరో మ్యాచ్ జరిగేలాగే కనిపించడం లేదు.  దీంతో మరోసారి ఈ దయాధుల పోరు ఎప్పుడు ఉందా అని అటు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు.

 అయితే టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత దాదాపు 8 నెలల గ్యాప్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది అని చెప్పాలి. 2025 ఫిబ్రవరి 19 తేదీ నుంచి మార్చి 9వ తేదీ మధ్య ఇక ఈ టోర్ని నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం లాహోర్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్నట్లు క్రిక్బజ్ పేర్కొంది  అయితే ఇలా లాహోర్లో మ్యాచ్ జరగడానికి బీసీసీఐ తో పాటు భారత ప్రభుత్వం కూడా అనుమతించాల్సి ఉంది. ఒకవేళ అనుమతి దొరకకపోతే హైబ్రిడ్ మోడల్ లో కేవలం టీమిండియ ఆడే మ్యాచ్ లు శ్రీలంక లేదంటే యూఏఈ వేదికగా నిర్వహించబోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: