అదే కొంపముంచింది .. అందుకే ఓడిపోయాం : బాబర్

praveen
వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంది అంటే చాలు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఎందుకో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే.. ఎన్ని టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగినా రాని కిక్కు అటు ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ చూస్తే వస్తుంది  అందుకే కేవలం రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ పరీక్షకులందరూ కూడా ఈ దాయాదుల పోరును చూసేందుకు ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఇక చిరకాల ప్రత్యర్ధుల పోరుని ప్రత్యక్షంగా చూడాలని ఎంతగానో ఆశ పడుతుంటారు అని చెప్పాలి.

 అయితే ఇటీవలే యూఎస్, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో అభిమానులు అందరి కోరిక తీరిపోయింది. ఎందుకంటే ఇండియా, పాకిస్తాన్ మధ్య న్యూయార్క్ వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే నువ్వా నేనా అన్నట్లుగానే ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఎప్పటిలాగానే టీం ఇండియా విజయం సాధించింది  ఆరు పరుగులు తేడాతో పాకిస్తాన్ ను ఓడించగలిగింది అని చెప్పాలి  అయితే ఇలా ఇండియా చేతిలో ఓడిపోవడంతో ఇక పాకిస్తాన్ సూపర్ 8 కు వెళ్లే అవకాశాలు క్లిష్టతరంగా మారిపోయాయి అని చెప్పాలి. కాగా పాకిస్తాన్ ఓటమిపై జట్టు కెప్టెన్ బాబర్ అజం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 అతిగా డాట్ బాల్స్ ఆడడమే మా కొంప ముంచింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కారణంగానే మ్యాచ్ ను కోల్పోయాము అంటూ బాబర్ అన్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు చర్చనీయాంశంగా మారిన పిచ్ గురించి మాట్లాడుతూ పిచ్ బాగానే ఉందని.. ఎలాంటి ఫిర్యాదులు లేవు అంటూ తెలిపాడు. కానీ కొన్ని బంతులు ఎక్స్ ట్రా బౌన్స్ వచ్చాయి అంటూ చెప్పుకొచ్చాడు  మేము బౌలింగ్లో సత్తా చాటాము  కానీ బ్యాటింగ్ లోనే విఫలమయ్యామ్. వరుసగా వికెట్లు కోల్పోవడం అధికంగా డాట్ బాల్స్ ఆడటం ఇక ప్రతికూలంగా మారిపోయింది. చేదన కోసం ప్రత్యేక ప్రణాళికలతో బలిలోకి దిగలేదు. సింపుల్గా నార్మల్గానే ఆడాలనుకున్నాం. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించాలని అనుకున్నాం. కానీ అలా చేయలేకపోయాం. అందుకే మేము ఈ మ్యాచ్ లో విజయం సాధించలేకపోయాం అంటూ చెప్పుకొచ్చాడు బాబర్ అజాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: