అరుదైన దృశ్యం.. లెజెండ్ ఆటోగ్రాఫ్ తీసుకున్న మరో లెజెండ్?

praveen
సాధారణంగా ప్రపంచ దేశాలలో క్రికెట్ కి ఉన్న ఆదరణ రోజురోజుకు పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందె. ఈ క్రమంలోనే క్రికెటర్లు కనిపించారు అంటే చాలు వారితో ఒక ఆటోగ్రాఫ్ అయినా లేదంటే ఫోటోగ్రాఫర్ అయినా తీసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.  ఇండియాలో అయితే క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక రకంగా చెప్పాలంటే దేవుళ్ళ లాగా క్రికెటర్లను ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే తమ అభిమాన క్రికెటర్లతో ఒక్క ఫోటో దిగిన చాలు అని ఎంతో మంది కోరుకుంటు ఉంటారు.

 ఇక అభిమాన క్రికెటర్ ఆటోగ్రాఫ్ ఇస్తే అంతకంటే ఇంకేం కావాలని అనుకుంటారు. అయితే కొంతమంది ఏకంగా తమ ఫేవరెట్ క్రికెటర్లను కలవడానికి కాస్త రిస్క్ చేస్తూ ఉంటారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో సెక్యూరిటీని దాటుకుని మరి మైదానంలోకి పరుగులు పెడుతూ చివరికి తమ అభిమాన ఆటగాడిని ఆలింగనం చేసుకొని ఏకంగా ప్రపంచాన్ని జయించినంతగా తెగ సంతోష పడిపోతుంటడం ఇప్పటివరకు ఎన్నోసార్లు చూశాం. అయితే ఇలా అభిమానులు ఏకంగా క్రికెటర్స్ ఆటోగ్రాఫర్లు తీసుకోవడం చూశాం. కానీ అప్పటికే క్రికెట్లో ఎంత నిరూపించుకోవాలో అంత నిరూపించుకొని.. లెజెండరీ ప్లేయర్గా పేరు సంపాదించుకున్న ఒక మాజీ ప్లేయర్ ఏకంగా ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఎప్పుడైనా చూసారా.

 ఇటీవల ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో మాత్రం ఈ అపురూప దృశ్యం కనిపించింది. వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ క్రిస్ గేల్ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అతని అందరూ యూనివర్సల్ బాస్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్కు దూరంగా ఉన్న లెజెండరీ క్రికెటర్ గేల్ ఇటీవల భారత్ పాక్ మ్యాచ్ వేదికలో సందడి చేశారు. భారత్ కు మద్దతిస్తున్నట్లు తెలిపేలా.. త్రివర్ణాలతో ఉన్న కోట్ ని ఆయన దరించారు.మైదానంలో తిరుగుతూ భారత కెప్టెన్ రోహిత్, కోహ్లీ తో పాటు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు గేల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: