పాకిస్తాన్ తో మ్యాచ్ ఫై.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన దాయదుల పోరుకు సమయం ఆసన్నమైంది  ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా t20 వరల్డ్ కప్ జరుగుతూ ఉండగా.. ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కానీ ఇక హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలుచుకునే  ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే నేడు సాయంత్రం 8 గంటలకు ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. న్యూయార్క్ ఇక ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తూ ఉంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే నేడు జరగబోయే దాయాదుల పోరులో ఎవరు విజేతగా నిలవబోతున్నారు అనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు  ఇదే విషయంపై స్పందిస్తూ ఇక తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు. ఇక ఇలాంటి రివ్యూలు కాస్త ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కూడా ఎన్నో రకాల భావోద్వేగాలతో కూడుకున్నది అన్న విషయం తెలిసిందే.  కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాదు క్రికెటర్లకు కూడా ఎప్పుడు ఒత్తిడి ఉంటుంది అని చెప్పాలి.

 అయితే నేడు పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ గురించి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ సమయంలో పాకిస్తాన్ తో మ్యాచ్ అనగానే ఎలాంటి ఒత్తిడి అయితే ఉంటుందో.. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో ఆ జట్టుతో మ్యాచ్ అనగానే అలాగే ఉంది అంటూ భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ప్రత్యర్థి, పిచ్ సమస్య కాదని ఎక్కడైనా మంచి క్రికెట్ ఆడటం ఎంతో ముఖ్యం అంటూ ఇటీవల మీడియా సమావేశంలో తెలిపాడు. టి20 ఫార్మాట్లో ప్రతి ఓవర్ కి మ్యాచ్ స్వరూపం మారిపోయే అవకాశం ఉంటుంది అంటూ అభిప్రాయపడ్డాడు  న్యూయార్క్ లోని పరిస్థితులకు అనుగుణంగా తాము మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నాము అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: