పాకిస్తాన్ తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు?

praveen
టీమిండియా ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి ఫార్మాట్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటుంది. కాగా ప్రస్తుతం వెస్టిండీస్, యుఎస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతూ వరల్డ్ కప్ ప్రస్తానాన్ని కొనసాగించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లో తప్పక టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది టీమిండియా.

 అయితే పటిష్టమైన టీమిండియా ఏ జట్టుతో మ్యాచ్ జరిగిన అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో లేదో కానీ భారత్కు చిరకాల ప్రత్యర్థిగా పిలుచుకునే పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే మాత్రం ఎంతో స్పెషల్ అని ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు కోట్లాదిమంది క్రికెట్ ప్రేక్షకుల భావోద్వేగాలతో కలుపుకొని ఉంటుంది అని చెప్పాలి. అందుకే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగిన కేవలం ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా ఈ పోరును చూసేందుకు ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. కాగా నేడు టి20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే నేడు పాకిస్తాన్తో జరగబోయే కీలకమైన పోరులో భారత తుది జట్టులో ఒక మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో కేవలం ఒక ఓవర్ మాత్రమే వేసిన అక్షర్ పటేల్ స్థానంలో చైనా మన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను తీసుకునే అవకాశం ఉంది అని సమాచారం. అయితే గత మ్యాచ్లో అమెరికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కెన్ జీగే బౌలింగ్లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు తడబడ్డారు. దీంతో భారత జట్టు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ తో ఇక పాకిస్తాన్ తో మ్యాచ్లో బరిలోకి దిగాలని అనుకుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: