టి20 వరల్డ్ కప్ లో.. మరో సంచలనం?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరి కన్ను కూడా ఉత్కంఠబరీతంగా సాగుతున్న t20 వరల్డ్ కప్ పైనే ఉంది అన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా జరుగుతున్న ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే ఇక ఈ ప్రపంచ కప్ టోర్నీలో కొన్ని జట్ల ప్రదర్శన పై  అభిమానుల అంచనాలు మొత్తం తారుమారు అవుతున్నాయ్. ఎందుకంటే పసికూనల బరిలోకి దిగిన కొన్ని టీమ్స్ ఏకంగా అగ్రశ్రేణి టీమ్స్ కి ఊహించని షాక్ ఇస్తున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ టి20 వరల్డ్ కప్ ఎన్నో సంచలన విజయాలకు వేదికగా మారిపోయింది.

 క్రికెట్లో చిన్న టీం గా కొనసాగుతున్న యూఎస్ఏ సొంతగడ్డపై అదరగొట్టేస్తుంది. ఏకంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకి అమెరికా జట్టు  ఊహించని షాక్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా పాకిస్తాన్ జట్టును సూపర్ ఓవర్ వరకు తీసుకువెళ్లిన అమెరికా జట్టు ఇక సూపర్ ఓవర్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి విజయం సాధించింది. అయితే ఇక ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో మరోసారి ఇలాంటి సంచలన విజయమే నమోదయింది. ఈ ప్రపంచకప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో న్యూజిలాండ్ కూడా ఒకటి. గత కొన్ని వరల్డ్ కప్ల నుంచి ఆ జట్టు ప్రదర్శన అద్భుతంగా సాగుతూ ఉంది.

 ఇక అలాంటి న్యూజిలాండ్ టీం ఈసారి మరిన్ని ఎక్కువ అంచనాలతోనే వరల్డ్ కప్ లో బరిలోకి దిగింది. కానీ అలాంటి జట్టును ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీం ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ సీలో భాగంగా ఇటీవల జరిగిన మ్యాచ్లో ఏకంగా 84 పరుగుల తేడాతో ఆఫ్గనిస్తాన్ కివీస్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ 159 పరుగులు చేయగా అనంతరం లక్ష్య చేదనకు దిగిన కివీస్ 75 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆఫ్గనిస్తాన్ కి భారీ విజయం సొంతమైంది. ఆఫ్గనిస్తాన్ జట్టులో గుర్బాజ్ 80 జాద్రాన్ 44 పరుగులతో రాణించారు. రషీద్ ఖాన్ 4, పారుఖి నాలుగు, నబి రెండు వికెట్లు పడగొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: