పసికూనే.. అయినా పెద్ద జట్లపై పంజా విసురుతుంది?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ టోర్ని జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఎన్నో రోజుల నుంచి సీనియర్ క్రికెటర్లు ఇస్తున్న రివ్యూలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ వస్తున్నాయి. అయితే ఎప్పటిలాగానే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న అగ్రశ్రేణి టీమ్స్ లో ఏదో ఒక జట్టు ఇక టైటిల్ విజేతగా నిలిచే అవకాశం ఉంది అని మాజీ ప్లేయర్లు అంచనా వేశారు. కానీ వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత చూస్తే మాత్రం సరైన టీమ్స్ వరస పరాజయాలతో సతమతమవుతుంటే.. చిన్న టీమ్స్ మాత్రం అంచనాలకు మంచి రాణిస్తున్నాయి.

 ఏకంగా బడా బడా జట్లను సైతం అలవోకగా ఓడిస్తూ సంచలన విజయాలను నమోదు చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా ఈ టి20 వరల్డ్ కప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమ్స్ లో ప్రస్తుతం వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా జట్టు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండానే అమెరికా జట్టు వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే కేవలం ఆతిథ్యం ఇస్తున్న కారణంగానే అమెరికాకు ప్రపంచకప్ టోర్నీలో ఛాన్స్ దక్కిందని.. ఇక మొదటి దశలోనే ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది. ఏకంగా పాకిస్తాన్ లాంటి అగ్రశ్రేణి టీం పై సంచలన విజయాన్ని నమోదు చేసి టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయింది.

 ఇలా ఏమాత్రం అంచనాలు లేని అమెరికా టి20 వరల్డ్ లో అదరగొడుతుంది అని చెప్పాలి. అయితే ఈ ప్రపంచకప్ టోర్నీకి ముందు బంగ్లాదేశ్ పై అమెరికా సిరీస్ విజయం సాధించింది. అయితే ఇది కేవలం గాలివాటం కారణంగానే జరిగిందని అందరూ కామెంట్ చేశారు. అయితే ఇది గాలి వాటం కాదని నిరూపిస్తూ ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్లో కెనడాపై విజయం సాధించింది. ఇక ఇటీవల మాజీ ఛాంపియన్ పాకిస్తాన్ కు సైతం షాక్ ఇచ్చి ఘనవిజయాన్ని అందుకుంది. ఈ విజయం ద్వారా ప్రపంచ కప్ లోకి తమ ఆగమనాన్ని ఘనంగా చాటింది అమెరికా జట్టు. బౌలింగ్ బ్యాటింగ్లో ఎంతో పటిష్టంగా కనిపిస్తూ అద్భుతంగా రాణిస్తుంది. తమ ఆట తీరుతో అమెరికా పెద్ద జట్లకే సవాల్ విసిరుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: