T20 వరల్డ్ కప్ లో.. పాకిస్తాన్ చెత్త రికార్డు?

praveen
జూన్ రెండవ తేదీ నుంచి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూసిన టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నిలో ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయం గురించి వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఎన్నో రివ్యూలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారిపోతున్నాయి. అయితే ప్రస్తుతం అన్ని టీమ్స్ కూడా సూపర్ 8లో అర్హత సాధించడమే లక్ష్యంగా అదరగొడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు మాత్రం మొదటి అడుగులోనే ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

 మొదటి మ్యాచ్ లో చిన్న టీం అయిన అమెరికాతో మ్యాచ్ ఆడింది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ లో ఎంతో అలవోకగా పాకిస్తాన్ విజయం సాధించడం ఖాయమని.. ఎంతో మంది క్రికెట్ నిపుణులు కూడా అంచనా వేశారు. కానీ అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ మ్యాచ్ లో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు చెత్త ప్రదర్శనతో చివరికి ఓటమి చవిచూసి పసికూన అమెరికాను కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయింది. అయితే పాకిస్తాన్ తమ ముందు ఉంచిన టార్గెట్ ను ఎంతో సమర్థవంతంగా చేదించిన అమెరికా సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లింది. ఇక సూపర్ ఓవర్ లో కూడా అదే రీతిలో రాణించి మాజీ ఛాంపియన్ పాకిస్తాన్ పై ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి.

 అయితే ఇలా సూపర్ ఓవర్లో ఓడిపోవడం ద్వారా పాకిస్తాన్ జట్టు ఖాతాలో ఒక చెత్త రికార్డు వచ్చి చేరిపోయింది. ఏకంగా మ్యాచ్ టై గా ముగిసిన రెండు మ్యాచ్లలో కూడా ఓడిన తొలి జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది పాకిస్తాన్. 2007లో భారత్ చేతిలో బౌల్ ఔట్ లో పాకిస్తాన్ ఓడిపోగా.. ఇటీవల టి20 వరల్డ్ కప్ 2024 లో పసికూన అమెరికా కూడా పాకిస్తాన్ జట్టుపై సూపర్ ఓవర్లో సంచలన విజయాన్ని సాధించింది. అయితే 2012లో కివీస్ పై శ్రీలంక, విండిస్ పై న్యూజిలాండ్, ఈ ఏడాది ఒమన్ పై నమీబియా సూపర్ ఓవర్లలో విజయం సాధించాయి. అయితే ఇలా అమెరికాతో మ్యాచ్లో ఓడిపోయిన పాకిస్తాన్ సూపర్ 8 కి అర్హత సాధిస్తుందా లేదా అనే విషయంపై మాత్రం సందిగ్ధత నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: