టి20 వరల్డ్ కప్ లో.. 43 ఏళ్ల బౌలర్ సంచలనం?

praveen
సాధారణంగా టి20 ఫార్మాట్లో బ్యాట్స్మెన్ లదే పై చేయి అని చెబుతూ ఉంటారు విశ్లేషకులు. ఎందుకంటే అతి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలి అనే ఒత్తిడి బ్యాట్స్మెన్ లపై ఉంటుంది. కాబట్టి ఇక క్రీజు లోకి రావడం రావడమే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉంటారు ఆటగాళ్లు. ఇలాంటి సమయంలో దంచి కొడదాం అనే ఆలోచనతో బ్యాట్ పట్టుకుని క్రీజ్ లోకి వచ్చిన బ్యాట్స్మెన్ లు ఇక అదే రీతిలో విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు. ఇలా బ్యాట్స్మెన్ ల దూకుడును ఆపడానికి బౌలర్లు శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఎంతోమంది స్టార్ బౌలర్లకు సైతం ఇలా బ్యాట్స్మెన్లను కట్టడి చేయడం చాలా కష్టమని చెప్పాలి. అలాంటిది 43 ఏళ్ళ  వయసులో ఉన్న బౌలర్ అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగడమే చాలా గొప్ప. అలాంటి బౌలర్ అరుదైన రికార్డు సృష్టించి బ్యాట్స్మెన్ లని కట్టడి చేయడం అంటే అది అసాధ్యమని చెప్పాలి. కానీ ఇక్కడ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఒక బౌలర్. ఏకంగా 43 ఏళ్ల వయసులో కూడా అరుదైన గణాంకాలు నమోదు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆ బౌలర్ సాధించిన అరుదైన ఘనత గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరో కాదు ఉగాండా బౌలర్ ఫ్రాంక్ అన్ సుబుగా.

 43 ఏళ్ల ఈ బౌలర్ పుపువ్వా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. టి20 ఫార్మాట్లో.. బ్యాట్స్మెన్ల విధ్వంసం కొనసాగే పొట్టి క్రికెట్లో ఇలా నాలుగు ఓవర్లకి నాలుగు పరుగులు మాత్రమే ఇవ్వడం నిజంగా సంచలనమే అని చెప్పాలి. అయితే ఇలా నాలుగు పరుగులు మాత్రమే ఇవ్వడం కాదు   రెండు వికెట్లు కూడా తీశాడు. ఇక అతను వేసిన నాలుగు ఓవర్లలో 20 డాట్ బాల్స్ కూడా ఉండడం విశేషం. అయితే టి20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ ఎకానమీ కావడం గమనార్హం.  దీంతో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు అందరు. బ్రాడ్మన్ పేరిట ఉన్న 2.25 ఎకానమీని 1.0 ఎకానమీతో బద్దలు కొట్టేశాడు ఫ్రాంక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: