కోహ్లీ కెరియర్ పై.. భారత మాజీ కీలక వ్యాఖ్యలు?

praveen
మొన్నటి వరకు ఐపీఎల్ తో క్రికెట్ ప్రేక్షకులందరూ అదిరిపోయే ఎంటర్టైర్మెంట్ పొందారు. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా యూఎస్, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీ నుంచి ఈ వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా అన్ని మ్యాచ్లు కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ గెలవడం లో వెనుకబడిపోయిన టీమిండియా.. ఈసారి మాత్రం ప్రపంచకప్ గెలవాలని పట్టుదలతో ఉంది.

 ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ లో అటు టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది   అయితే ఇక విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి కీలక ప్లేయర్లు ఈ వరల్డ్ కప్ లో ఎలా రాణించబోతున్నారు అనే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు  ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి ఇక ఈ టి20 వరల్డ్ కప్ చివరిది అయ్యే అవకాశం ఉందని కొంతమంది మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 విరాట్ కోహ్లీ టి20 వరల్డ్ వరల్డ్ కప్ లో కూడా ఆడే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ బాగుంది అతనికి ఇదే లాస్ట్ చాన్స్ కాదు. 2026 వరల్డ్ కప్ లోను అతను ఆడగలడు. ఆ టోర్ని ఇండియాలో జరగబోతుంది. కాబట్టి స్వదేశంలో ఆడేందుకు ఏ ఆటగాడికైనా ఆసక్తి చూపిస్తారు. కోహ్లీ ఖాతాలో ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ లేదు. ఈసారి ఎలాగైనా గెలవాలని రోహిత్ తో పాటు కోహ్లీ కూడా కసిగా ఉన్నాడు అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ వాక్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: