అరుదైన అవార్డుతో సూర్య.. ఫోటో వైరల్?

praveen
టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే . ఎందుకంటే అతి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలి అనే మైండ్ సెట్ తో బరిలోకి దిగే బ్యాట్స్మెన్లను కట్టడి చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఇక బ్యాట్స్మెన్లు అందరూ కూడా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉంటారు. అలా అని అందరికీ అది సెట్ అవుతుందా అంటే.. అది కాదు. ఎందుకంటే బ్యాట్స్మెన్ లను అవుట్ చేసేందుకు వికెట్లను దక్కించుకునేందుకు బౌలర్లు వేసే వైవిద్యమైన బంతులను కూడా బౌండరీకి తరలించిన వాడే టి20 ఫార్మాట్లు తోపు అవుతాడు.

 కానీ చాలామంది బ్యాట్స్మెన్లు మాత్రం కొన్ని కొన్ని సార్లు భారీ షాట్లకు ప్రయత్నించి చివరికి తడబాటుకు గురై ఇక వికెట్ కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొంతమంది మాత్రం పొట్టి ఫార్మాట్లో తమను మించిన ఆటగాడు మరొకరు లేరు అన్న విషయాన్ని ఎప్పుడూ నిరూపిస్తూ ఉంటారు. అలాంటి ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ కూడా ఒకరు అనే విషయం తెలిసిందే. అద్భుతమైన ఆట తీరుతో అతను గత రెండేళ్ల నుంచి కూడా t20 ఫార్మాట్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ వస్తున్నాడు అని చెప్పాలి.

 అతను బ్యాట్ పట్టుకొని మైదానంలోకి వచ్చాడు అంటే చాలు బౌలర్ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎక్కడ బంతి వేసిన కూడా బౌండరీ బాదగల నైపుణ్యం అతని సొంతం. మైదానం నలువైపుల భారీ షాట్లు కొడుతూ అదరగొడుతూ ఉంటాడు. ఇక మిస్టర్ 360 ప్లేయర్ గా కూడా గుర్తింపుని సంపాదించుకున్నాడు. కాగా ఇటీవల సూర్య కుమార్ యాదవ్ ఐసిసి ఇంటర్నేషనల్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును అందుకున్నాడు.  ఇక ఈ పురస్కారాన్ని వరుసగా రెండుసార్లు 2022, 23లో గెలుచుకున్న తొలి భారతీయుడిగా సూర్యా నిలిచాడు. కాగా ప్రస్తుతం సూర్య కుమార్ 861 రేటింగ్ పాయింట్లతో టి20 ఫార్మాట్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: