ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఒక్కడు.. అతనే?

praveen
మార్చి 22వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్ టోర్నీ ముగిసింది. ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచిన ఐపిఎల్ లో ఇక ఈసారి ఛాంపియన్ ఎవరో తేలిపోయింది.  ఒకప్పుడు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి తడబడిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు.. ఇక మెంటార్గా ఆ జట్టు మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ రావడంతో ఎంతో దూకుడుగా ఆడటం మొదలుపెట్టింది. ఇక గంభీర్ తన వ్యూహాలతో కోల్కతా జట్టును ఎంతో సమర్థవంతంగానే ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ నుంచి ఎంతో దూకుడుగా ఆడుతూ వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఇక ఫైనల్లో కూడా అదరగొట్టింది.

 ఈ క్రమంలోనే పాయింట్లు పట్టికలో మొదటి నుంచి అగ్రస్థానంలో కొనసాగిన కోల్కతా జట్టు.. ఇక టైటిల్ గెలవడంలో కూడా తమ సత్తా ఏంటో నిరూపించింది. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఇక ఫైనల్లో విజయం సాధించి ఐపీఎల్ టైటిల్ను మూడవసారి ముద్దాడింది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు. అయితే కోల్కతా జట్టు ఈ ఐపీఎల్ మొత్తం ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసింది.. ఇక ఆ జట్టు విజయాలలో కీలక పాత్ర వహించింది ఆల్రౌండర్ సునీల్ నరైన్ అని చెప్పాలి. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ.. మంచి ఆరంభాలు అందించిన ఈ ఆటగాడు.  ఇక తన స్పిన్ బౌలింగ్ తో కూడా వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర వహించాడు.

 ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత విలువైన ఆటగాడిగా సునీల్ నరైన్ నిలిచాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపిఎల్ హిస్టరీలో ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. అత్యధిక సార్లు అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన ప్లేయర్గా సునీల్ నరైన్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు మూడు సీజన్లలో అతను ఈ ఘనతను అందుకున్నాడు. 2012లో 24 వికెట్లు, 2018లో 357 పరుగులు 17 వికెట్లు, 2024లో 488 పరుగులు 17 వికెట్లతో రాణించి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా నిలిచాడు. కోల్కతా జట్టు విజయాల్లో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: