సాల్ట్ లేని KKR.. చప్పగా అవుతుందా ఏంటీ?

praveen
ఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైర్మెంట్ పంచుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి నుంచి నాకౌట్ మ్యాచ్లు జరగబోతున్నాయి. నేడు ఇక ఐపీఎల్ లో భాగంగా మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఈ క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా పాయింట్స్ టేబుల్ లో  మొదటి రెండు స్థానాలు నిలిచిన జట్లు పోటీ పడబోతున్నాయి. టాప్ లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్, రెండవ స్థానంలో కొనసాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది.

 అయితే ఈ రెండు టీమ్స్ కూడా ఈ ఐపీఎల్ సీజన్లో అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే అటు ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయించాయ్ అని చెప్పాలి. దీంతో ఈ రెండు టీమ్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఏ టీం గెలుస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఈ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన కోల్కతా జట్టుకి ఓ కీలక ప్లేయర్ దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అతనే ఫీల్ సాల్ట్.

 విధ్వంసకర ఓపెనింగ్ తో ఆకట్టుకున్న నరైన్ తో కలిసి అతను మరోవైపు నుంచి విధ్వంసం సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఐపీఎల్ లో 435 పరుగులు చేసి కోల్కతా విజయాలను కీలకపాత్ర వహించాడు. మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ భారీ స్కోర్ చేసి అటు కోల్కతాని విజయాల బాట పట్టించాడు  అయితే టి20 వరల్డ్ కప్ కోసం అతను ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. దీంతో ఇక కోల్కత్తా కొత్త ఓపెనర్ ను వెతుక్కోవలసిన పని ఏర్పడింది. దీంతో కోల్కతా ఓపెనింగ్ జోడి పై ప్రస్తుతం ఆందోళనలు నెలకొన్నాయ్ . ఆ స్థానంలో వెంకటేష్ అయ్యర్ ను దించే అవకాశం ఉంది. అయితే వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్లో 267 పరుగులు చేసి పర్వాలేదు అనిపించినా.. ఫిల్ సాల్ట్ లేని ఓపెనింగ్ చప్పగా ఉండనుంది అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: