ధోనికి ఇదే చివరి సీజనా.. కోహ్లీ ఏమన్నాడో తెలుసా?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్  మహేంద్ర సింగ్ ధోని 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అభిమానుల కోసం ఇంకా ఐపీఎల్లో కొనసాగుతూనే ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా అతను బాగా రాణిస్తూనే ఉన్నాడు. ఈ క్రమం లోనే తన కెప్టెన్సీ బాధ్యతలను సమర్ధుడైన మరొకరికి అప్పగించి ఐపీఎల్ రిటైర్మెంట్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాడు ధోని.ఈ క్రమం లోనే గతం లో జడేజాకు కెప్టెన్సీ అప్పగించి చివరికి ధోని దెబ్బ తిన్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఎందుకంటే సారధ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించలేకపోయిన రవీంద్ర జడేజా.. మళ్ళీ ధోని చేతికే కెప్టెన్సీ అప్పగించాడు. దీంతో ధోని తర్వాత చెన్నై నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనే విషయంపై చర్చ జరిగింది. అయితే 2024 ఐపీఎల్ సీజన్ కి ముందు రుతురాజ్ కి సారధ్య బాధ్యతలు అప్పగించిన ధోని.. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు. ఇక రుతురాజ్ కూడా కెప్టెన్సీలో పరవాలేదు అనిపించాడు. దీంతో దోనికి ఇదే చివరి సీజన్ అంటూ ప్రచారం మొదలైంది. అందుకే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

 అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా అన్న విషయం తమకు కూడా క్లారిటీ లేదని అన్ని రహస్యంగా ఉంచుతాడంటూ సిఎస్కే కోచ్ కూడా కామెంట్స్ చేశాడు. అయితే ఇటీవల ఇదే విషయంపై కోహ్లీకి కూడా ప్రశ్న ఎదురైంది. ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని అనుమానం వచ్చేలా కోహ్లీ కామెంట్స్ చేశాడు. ధోనితో ఇవాళ మ్యాచ్ ఆడుతున్న నాకు తెలిసి మేము కలిసి ఆడటం ఇదే చివరిదేమో. అతడు కొనసాగుతాడో లేదో ఎవరికి తెలుసు? ఈ మ్యాచ్ ఫ్యాన్స్ కి అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. మేం దేశం తరఫున చాలా ఏళ్లు ఆడాం. టీం ను ఎన్నోసార్లు గెలిపించామంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: