వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేయకపోవడంపై.. రియాన్ పరాగ్ ఏమన్నాడో తెలుసా?

praveen
ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించింది అన్న విషయం తెలుస్తుంది. అయితే ఇక బిసిసిఐ వరల్డ్ కప్ జట్టు ప్రకటన చేసిన నాటి నుంచి కూడా ఇదే విషయం గురించి చర్చి జరుగుతుంది. వాస్తవానికి ఐపీఎల్ లో రాణించిన ఎంతోమంది యువ ఆటగాళ్లకు కూడా t20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుందని అభిమానులు అందరూ కూడా ఊహించారు. మాజీ ప్లేయర్లు ఇక ఇదే రీతిలో అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో సెలెక్టర్లు మరోలా ఆలోచించారు. ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్లకు కాకుండా అంతకుముందు టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించిన కొంతమంది ప్లేయర్లకు ఛాన్సులు ఇచ్చారు. ఫామ్ లో లేని వాళ్లను సైతం ఇక వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది.

 ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న రియాన్ పరాగ్ రింకు సింగ్ లాంటి ప్లేయర్లకు సెలెక్టర్ నుంచి మొండి చేయి ఎదురయింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఇద్దరు క్రికెటర్ల అభిమానులు అందరూ కూడా నిరాశలు మునిగిపోతున్నారు. ఇంకా ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా ప్రస్తుత ఐపీఎల్ లో బాగా రాణిస్తున్న ఈ ఇద్దరు క్రికెటర్లను ఎందుకు సెలెక్ట్ చేయ లేదు అంటూ సెలెక్టర్ల తీరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. అయితే తనను టీ20 వరల్డ్ కప్ జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై రాజస్థాన్ ప్లేయర్ రియాన్ పరాగ్ స్పందించాడు.

 టి20 వరల్డ్ కప్ కి ఎంపిక కాకపోవడం గురించి తాను ఆలోచించడం లేదు అంటూ రియాన్ పరాగ్ తెలిపాడు. గత ఏడాది కనీసం ఐపీఎల్లో ఆడేందుకు కూడా నేను పోటీలో లేను. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలు సరైన కారణాలతో నా పేరును ప్రస్తావిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వరల్డ్ కప్ సెలక్షన్ గురించి నేను ఏం ఆలోచించడం లేదు. మా టీం ప్లేయర్లు ఎంపిక ఇవ్వడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. భారత్ కప్పు గెలుస్తుందని ఆశిస్తున్నాను అంటూ రియాన్ పరాగ్ స్పందించాడు. అయితే ఇలా తనను సెలెక్ట్ చేయకపోవడంతో సెలెక్టర్లను విమర్శించడం మానేసి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన రియాన్ పరాగ్ ఫై ప్రశంసలు కురిపిస్తున్నారు అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: