ధోనిని చూసి.. మా బౌలర్లు భయపడ్డారు : కేఎల్ రాహుల్

praveen
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వింటేనే బౌలర్లు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే అతని బ్యాటింగ్ విధ్వంసం ఆ రేంజ్ లో ఉంటుంది. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయటానికి  వస్తూ డెత్ ఓవర్లలో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇకజట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా ధోనీ తన బ్యాటింగ్ విధ్వంసంతో అదరగొడుతూ ఉంటాడు. అయితే ప్రస్తుతం 2024 ఐపీఎల్ సీజన్లో అయితే ధోని మరోసారి తన బ్యాటింగ్తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ వదిలి ఆ టీంలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

 అయితే ఇక ధోనికి ఇదే చివరి ఐపిఎల్ సీజన్ అని ప్రేక్షకులు అనుకుంటున్నా ఈ సీజన్లో ధోని మునుపటి మెరుపులు మెరిపించి రిటైర్మెంట్ ప్రకటిస్తే చూడాలని అభిమానులు కోరుకున్నారు. అయితే ఇక ఎప్పుడూ ప్రతి మ్యాచ్ లో కూడా ధోని ఫ్యాన్స్ కోరిక తీరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. చివర్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాడు. సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతూ మరోసారి వింటేజ్ ధోనిని గుర్తు చేస్తున్నారు మహేంద్రుడు. ఇటీవల లక్నోతో జరిగిన మ్యాచ్ లో తొమ్మిది బంతుల్లోనే 28 పరుగులు చేశాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా బ్యాటింగ్ చేయడానికి ధోని స్టేడియంలోకి అడుగు పెట్టాడు అంటే చాలు అభిమానులందరూ ధోని నినాదాన్ని అందుకుంటున్నాడు. దీంతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది అని చెప్పాలి. ఇదే విషయం గురించి లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని మైదానంలోకి బ్యాటింగ్ చేయడానికి వస్తుంటే తమ జట్టు బౌలర్లు భయపడ్డారు. అతని బ్యాటింగ్కు రావడం చూసి స్టేడియంలోని ప్రేక్షకులు భారీ శబ్దాలు చేయడంతో బౌలర్లు ఒత్తిడికి గురయ్యారు అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే మ్యాచ్లో ధోని వస్తున్నప్పుడు తనకు సౌండ్ అలెర్ట్ వచ్చిందని డీకాక్ భార్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: