సన్రైజర్స్ కి బిగ్ షాక్.. అతను ఐపీఎల్ మొత్తానికి దూరం?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అప్పుడెప్పుడో 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది సన్రైజర్స్. కానీ అప్పటినుంచి ఇప్పటివరకు హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అనేది కేవలం అందని ద్రాక్ష లాగే మారిపోయింది. జట్టులో ఉన్న ఆటగాళ్లను ఎన్నిసార్లు మార్పులు చేసిన.. ఇక జట్టు కెప్టెన్లను సైతం మార్చిన ఆ టీం కి అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు.

 అయితే మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్న విధంగా సన్రైజర్స్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఏకంగా జట్టును పటిష్టంగా మార్చుకుంది అని చెప్పాలి. గత ఏడాది జరిగినా వన్డే వరల్డ్ కప్ టోర్నిలో ఫ్యాట్ కమిన్స్ ను 20 కోట్లకు పైగా ఖర్చు చేసి జట్టులోకి తీసుకుంది. అతని చేతిలో కెప్టెన్సీ పెట్టింది. ఇక అతని సారథ్యంలో సన్రైజర్స్ అద్భుతమైన ఆట తీరుతో ముందుకు సాగుతుంది. కొన్ని మ్యాచ్లలో ఓడిపోయిన సన్రైజర్స్ ఆట తీరు మాత్రం అభిమానులను సంతృప్తి పరుస్తుంది అని చెప్పాలి. అయితే ఇలా గత ఏడాది జరిగిన వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన సన్రైజర్స్ యాజమాన్యం శ్రీలంక ప్లేయర్  హసరంగను కూడా జట్టులోకి తీసుకుంది.

 కానీ ఈ ఆటగాడి విషయంలో జట్టు యాజమాన్యానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.  ఎందుకంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే  హసరంగా ఐపీఎల్ సీజన్ మొత్తానికి కూడా దూరం అయ్యాడు. ఎడమ మడమ నొప్పి కారణంగా ఐపీఎల్ టోర్నికి దూరమైనట్లు సమాచారం. కాగా మినీ వేలంలో హసరంగాను 1.5 కోట్లు పెట్టి జట్టులోకి తీసుకుంది. అయితే జూన్లో జరగబోయే టి20 వరల్డ్ కప్ దృశ్య రిస్క్ తీసుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఇక అతనికి లంక బోర్డు విరామం  ఇచ్చినట్టు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం అతను శ్రీలంకలోనే రెస్ట్ తీసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: