RCB బి లేడీ ఫ్యాన్ కి.. హీరోయిన్ గా ఛాన్స్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో అత్యంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న టీం ఏది అంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అని చెప్పాలి. సాధారణంగా ఐపీఎల్లో ఛాంపియన్ టీమ్ అనగానే ముంబై, చెన్నై జట్లు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కూడా ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా టైటిల్స్ గెలిచాయి కాబట్టే ఈ రెండు టీమ్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవక పోయినప్పటికీ బెంగళూరు జట్టుకి ఈ టీమ్స్ తో సమానంగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పాలి.

 ఇక ఆర్సిబి అంటే పడి చచ్చిపోయే లేడీ ఫ్యాన్స్ అయితే కోట్లలోనే ఉంటారు. ఇక ఆర్సిబి ఓడిపోయిన ప్రతిసారి కూడా ఆ జట్టుకు సపోర్ట్ చేస్తూ ఈసారి ఓడిపోవచ్చు. కానీ మరోసారి తప్పకుండా గెలిచి తీరుతుంది అంటూ చెప్పడం చూస్తూ ఉంటాం. అయితే ఇటీవల ఐపీఎల్ సీజన్ 17 తొలి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్  బెంగళూరు జట్టు ఓటమిపై ఇటీవల ఒక యువతి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది అన్న విషయం తెలిసిందే. గెలుపు ఓటములు అనేవి ఆటలో సహజం.. ఈసాల కప్ నందే  అంటూ చెప్పి ఆర్సిబి అభిమానులు అందరిలో కూడా ధైర్యాన్ని నింపింది ఆ యువతి.

 క్యూట్ క్యూట్ లుక్స్ తో కనిపించిన ఆ లేడీ ఆర్సిబి ఫ్యాన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. అయితే ఇలా వీడియోలో వైరల్ గా మారిపోయిన ఆ లేడీ అభిమానికి ఇక ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ తగిలింది అన్నది తెలుస్తుంది. ఏకంగా హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిందట ఆ లేడీ ఫ్యాన్. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఇక ఓ మూవీ కోసం హీరోయిన్గా ఎంపిక చేశారట. ఏకంగా స్టార్ హీరో సరసన జోడిగా నటించబోతుందట ఈ ముద్దుగుమ్మ. నిజంగా ఇది అదృష్టమే కదా. ఆఫీస్ ల చుట్టూ తిరిగితేనే అవకాశాలు రాని నేటి రోజుల్లో ఒక వీడియోతో సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది ఈ లేడీ ఫ్యాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb

సంబంధిత వార్తలు: