చరిత్ర సృష్టించిన ఆర్సిబి.. టీమిండియాను వెనక్కి నెట్టేసింది?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న జట్టు ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరు చెబుతూ ఉంటారు. అయితే బెంగళూరు టీం ఇప్పటివరకు మిగతా టీమ్స్ లాగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. కానీ ఇక ఈ టీం కి ఎప్పటికప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతూనే ఉంది. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారైనా బెంగళూరు జట్టు టైటిల్ గెలుస్తుందేమో అని అభిమానులు ఎన్నోసార్లు నిరీక్షణగా ఎదురుచూసిన ప్రతిసారి నిరాశే ఎదురవుతూ వస్తోంది అన్న విషయం తెలిసిందే.

 అయితే 2024 ఐపీఎల్ సీజన్ లో అయినా అటు బెంగళూరు టీం టైటిల్ గెలుస్తుందని బలంగా నమ్మకం పెట్టుకున్నారు అభిమానులు. ఎందుకంటే అంతకు ముందు జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సిబి మహిళల జట్టు టైటిల్ విజేత నిలిచింది. దీంతో ఇక ఇప్పుడు పురుషుల జట్టు కూడా టైటిల్ గెలిచిందంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు అని అందరు అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో వరుసగా ఓటములు చవిచూస్తూ అభిమానులందరినీ కూడా తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో మరోసారి దారుణం ఓటమిని చవిచూసింది.

 ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ బెంగళూరు టీం సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన టీమ్గా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇప్పటివరకు 18 సెంచరీలు నమోదు చేసి తొలి స్థానంలో ఉండగా.. ఇక భారత జట్టు 17 సెంచరీలతో రెండవ స్థానంలో ఉంది. ఇక తర్వాత 14 సెంచరీలతో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మూడో స్థానంలో నిలిచాయి అని చెప్పాలి. అయితే ఇలా భారీగా పరుగులు చేసి సెంచరీల మోత మోగించిన ఏం లాభం.. విజయం సాధించకుండా టైటిల్ వేటలో వెనకబడిపోయినప్పుడు అని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: