ధోని బ్యాటింగ్ కి రావద్దని.. కమ్మిన్స్ మాస్టర్ ప్లాన్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరుగుతున్న వరుస మ్యాచ్లు ప్రేక్షకులందరికీ  కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఐపీఎల్ సీజన్ కొంతమంది ప్లేయర్లకు చివరి సీజన్ అంటూ ప్రచారం జరుగుతుంది. అలాంటి వారిలో మహేంద్రసింగ్ ధోని కూడా ఒకరు. అయితే ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుండి కూడా చెన్నై కెప్టెన్గా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన ధోని ఇక ఇప్పుడు 17వ సీజన్లో కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ఋతురాజ్ కి సారధ్య బాధ్యతలు అప్పగించాడు. దీంతో ధోనికి ఇదే చివరి సీజన్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు.

 ఇలాంటి సమయంలో ధోనీకి చివరి సీజన్ అయిన ఐపీఎల్ 2024 లో అయినా ఇక ధోని తన ఆట తీరుతో  ప్రేక్షకులను అలరించి.. రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చే ధోనీకి పెద్దగా ఆడే అవకాశం లభించడం లేదు.ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం అదరగొట్టిన ధోని మెరుపు బ్యాటింగ్ తో అభిమానులను అలరించాడు. అయితే ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా ధోని తొందరగా బ్యాటింగ్ చేయడానికి వస్తాడని అందరూ అనుకున్నారు.

 కానీ చివర్లో వచ్చి రెండు బంతులు మాత్రమే ఆడిన ధోని కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. అయితే ధోని ఇలా తొందరగా బ్యాటింగ్ కు రాకుండా ఉండడానికి సన్రైజర్స్ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు అన్నది తెలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ 19 ఓవర్ లో భువి వేసిన బంతిని డిఫెన్స్ ఆడిన జడేజా.. పరుగుకు ప్రయత్నించి వెనక్కి వెళ్ళాడు. దీంతో భువనేశ్వర్ కొట్టిన త్రో అతడి వీపును తాకింది. నిబంధనల ప్రకారం దాన్ని అబ్ స్ట్రక్షన్ అవుట్ గా పరిగణిస్తారు. కానీ కెప్టెన్ పాట్ కమిన్స్ దానిని అప్పీల్ చేయలేదు. రివ్యూ కూడా తీసుకోలేదు. అయితే దీని వెనుక కమిన్స్ మాస్టర్ ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. జడ్డు అవుట్ అయిన తర్వాత ధోని వస్తే విరుచుకుపడే ప్రమాదం ఉంది. అందుకే కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్న జడేజానే క్రీజులో ఉండే విధంగా ఇక రివ్యూ తీసుకోకుండా.. ధోని రాకుండా మాస్టర్ ప్లాన్ వేసాడట కమిన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: