డూ ఆర్ డై.. హార్థిక్ పాండ్యాకు లాస్ట్ చాన్స్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ టీం గా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. ఏకంగా ఐదు టైటిల్స్ గెలిచి అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది అని చెప్పాలి. అయితే 2024 ఐపిఎల్ సీజన్ ప్రారంభానికి ముందు అటు ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టును ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించింది ఫ్రాంచైజీ. ఈ క్రమంలోనే కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించింది.

 ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పై అటు తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత కూడా ఈ విమర్శలు తగ్గడం లేదు. కనీసం హార్దిక్ కెప్టెన్సీ లో ముంబై వరుస విజయాలు సాధించిన.. ఈ విమర్శలు తగ్గేవేమో. కానీ హార్దిక్ కెప్టెన్సీలో ఇప్పుడు వరకు మూడు మ్యాచ్లలో మూడింటిలో కూడా ఓడిపోయింది ముంబై. దీంతో ఆ విమర్శలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. ఇలా వరుస ఓటముల నేపథ్యంలో  హార్థిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ నుంచి తప్పించవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.

 అయితే పాండ్యాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని ముంబై ఫ్రాంచైజీ   భావిస్తుందట. మరో రెండు అవకాశాలు మాత్రమే ఇవ్వబోతుందట. తర్వాత జరిగే రెండు మ్యాచ్లలో ముంబై జట్టుకు కెప్టెన్గా విజయం అందించడంతోపాటు వ్యక్తిగత ప్రదర్శనకూడా అద్భుతంగా ఉండాలని కండిషన్ పెట్టిందట. అలా అయితేనే కెప్టెన్గా కొనసాగిస్తామని లేదంటే కెప్టెన్సీ మార్పు తప్పదు అంటూ స్పష్టం చేసిందట జట్టు యాజమాన్యం. మరి ఇలా హార్దిక్ పాండ్యా తనకు వచ్చిన లాస్ట్ ఛాన్స్ ని ఉపయోగించుకుంటాడా లేదా చూడాలి. కాగా ఈనెల 7వ తేదీన హోమ్ గ్రౌండ్ అయినా వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలబడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: