CSK జట్టుకి బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. ఈసారి కొత్త సారధితో బరిలోకి దిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి చెన్నై జట్టును కెప్టెన్గా ముందుకు నడిపిస్తున్న మహేంద్ర సింగ్ ధోని సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆ జట్టులో యువ ఓపెనర్ గా కొనసాగుతున్న రుతురాజ్   చేతికి సారధ్య బాధ్యతలు వెళ్లాయి. అయితే ధోని ఆధ్వర్యంలోనే ఋతురాజ్ కెప్టెన్సీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జట్టును ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పాలి.

 అయితే గత ఐపీఎల్ సీజన్లో టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై జట్టు ఈ ఐపీఎల్ లో డిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగింది. దీంతో ఈ టీం ప్రదర్శన పై భారీగానే అంచనాలు ఉన్నాయి. అంచనాలు పెట్టుకున్నట్లుగానే ఈ టీం వరుసగా రెండు విజయాలతో అదరగొట్టేసింది. కానీ ఆ తర్వాత రెండు ఓటములు చవి చూసి అభిమానులు నిరాశపరిచింది అని చెప్పాలి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తప్పకుండా పుంజుకుంటుంది అనుకుంటున్న సమయంలో.. ఇటీవల చెన్నై జట్టుకి బిగ్ షాక్ తగిలింది. ఏకంగా ఆ జట్టులో మెయిన్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్న ముస్తాఫిర్ రెహ్మాన్ జట్టుకు దూరమయ్యాడు.

 ఇటీవలే సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో అతను ఆడలేదు. దీంతో తర్వాత మ్యాచ్లో అయినా అతను అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అతను మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చిన ఎక్కువ రోజులు జట్టుకు అందుబాటులో ఉండడట. దీంతో ఇక సీఎస్కే కి బిగ్ షాక్ తగిలింది. ఏకంగా ఈ నెలాఖరూ వరకు అతను అందుబాటులో ఉంటాడు అన్నది తెలుస్తుంది. బంగ్లా క్రికెట్ బోర్డు అతనికి ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఎన్ఓసి జారీ చేసింది. ఆ తర్వాత టి20 సిరీస్ కోసం అతను బంగ్లాదేశ్ జట్టులో చేరబోతున్నాడు. దీంతో మే నెలలో జరగబోయే మ్యాచ్లకి అతను దూరం కాబోతున్నాడు. కాగా ఈ సీజన్లో రెండు మ్యాచ్లలో 7 వికెట్లు తీసాడు ముస్తాఫిజుర్ రహ్మాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: