ఐపీఎల్ లో బ్యాటింగ్ చాలా ఈజీ.. పాక్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి వరల్డ్ క్రికెట్లో ఎంత ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుందో అందరికీ తెలిసిన విషయమే. ఏకంగా వరల్డ్ లోనే రిచెస్ట్  క్రికెట్ లీగ్ గా కొనసాగుతూ ఉంది. అయితే ఐపీఎల్ తరహా లోనే కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు టి20 టోర్నిలు నిర్వహిస్తూ ఉన్నాయి. కానీ ఐపీఎల్ కు వచ్చిన క్రేజ్ మాత్రం ఏ టోర్నీకి రాలేదు. ఏకంగా దేశ విదేశాల నుంచి కూడా ప్లేయర్లందరూ ఐపీఎల్ లో పాల్గొనడానికి తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.

 వరల్డ్ క్రికెట్ లో ఉన్న అత్యుత్తమ ప్లేయర్స్ అందరితో కూడా డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే ఇక గొప్ప అనుభవాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. అయితే ఐపీఎల్ ఆడటం అంత సులభమైన విషయమేమీ కాదు అని ఎంతోమంది ప్లేయర్లు అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ కొంతమంది పాకిస్తాన్ ప్లేయర్లు మాత్రం ఐపీఎల్ పై తమ అక్కస్సును వెళ్లగక్కుతూ ఉంటారు. పాక్ క్రికెటర్లపై  నిషేధం ఉన్న నేపథ్యంలో అందరి క్రికెటర్ల లాగా పాకిస్తాన్ ప్లేయర్లకు ఐపిఎల్ ఆడేందుకు అవకాశం లేదు. దీంతో ఐపీఎల్ టోర్నీ గురించి ఎప్పుడూ ఏదో ఒక విధంగా నోరు పారేసుకుంటూ ఉంటారు పాకిస్తాన్ క్రికెటర్లు.

 ఇక ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జూనైద్ ఖాన్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీలో బ్యాటింగ్ చేయడం చాలా సులభం అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో అన్ని ఫ్లాట్ పిచ్లు ఉంటాయి. వాటిపై బ్యాటింగ్ చేయడం చాలా సులభం. అంతర్జాతీయ టి20లలో మొత్తం కలిపి 155 పరుగులు మాత్రమే చేసిన సునీల్ నరైన్.. ఇటీవల ipl లో జరిగిన మ్యాచ్లో మాత్రం 85 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్. అయితే అతని పోస్ట్ ఫై భారత క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: