మొన్నే ఐపీఎల్ లోకి వచ్చి.. అంతలోనే చరిత్ర సృష్టించాడు?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త ప్రతిభకు చిరునామాగా కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి బాగా రాణించాలి అనుకునే ఎంతో మంది యువ ఆటగాళ్లు లో ఐపీఎల్ తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఒక మంచి ఫ్లాట్ ఫామ్ లా కొనసాగుతూ ఉంది. ఇక ప్రతి ఏడాది ఐపిఎల్ సీజన్ లో కొత్త ఆటగాళ్లు కనిపిస్తూ తమ ప్రతిభను నిరూపించుకుంటూ ఉంటారు. అటు ఆ తర్వాత  అంతర్జాతీయ క్రికెట్ లో కూడా అవకాశాలు దక్కించుకోవడం చూస్తూ ఉంటాం.

 అయితే ఈ ఏడాది కూడా ఇలా ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చి  వరుసగా మ్యాచ్ లు ఆడుతున్న యువ ఆటగాళ్ళు తమ ప్రదర్శనతో అదరగొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే వరల్డ్ క్రికెట్ ఏలబోయే ఫ్యూచర్ స్టార్ మేమె అన్న విషయాన్ని ప్రతి మ్యాచ్ కూడా అదరగొట్టేస్తూ అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఐపిఎల్ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లలో లక్నో టీం కి ప్రాతినిధ్యం వహిస్తున్న మయాంక్ యాదవు కూడా ఒకరు. కేవలం కొంతమంది పేస్ బౌలర్లకు మాత్రమే సాధ్యమైనా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాడు.

 ఈ క్రమంలోనే లక్నో యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా మూడుసార్లు 155 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి రికార్డులు సృష్టించాడు మయాంక్ యాదవ్. అతను ఇప్పుడు వరకు రెండు మ్యాచ్లు ఆడగా 50 కంటే ఎక్కువ బంతులే ఇలా 155 కిలోమీటర్లకు పైగా వేగంతో వేసి ఈ ఫీట్ సాధించాడు. కాగా ఉమ్రాన్ మాలిక్, నోర్జె రెండు సార్లు ఈ రికార్డు అందుకున్నారు. అయితే ఐపీఎల్ హిస్టరీలో షాన్ టైట్ వేసిన 150 పాయింట్ ఏడు కిలోమీటర్ల బేగంతో వేసిన బంతి ఇక అత్యంత ఫాస్టెస్ట్ బాల్ గా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఎవరు బద్దలు కొట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: