ముంబై కెప్టెన్సీ మార్పుపై.. రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు?
లక్షల మంది క్రికెట్ ప్రేక్షకులు ముంబై ఇండియన్స్ తీరు నచ్చక సోషల్ మీడియాలో కూడా అన్ ఫాలో కొట్టేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్ ను ఎలా ముందుకు నడిపిస్తాడో చూడాలని అందరూ ఎదురు చూశారు. అయితే హార్దిక్ కెప్టెన్సీ లో ఒక్క విజయాన్ని కూడా ఇప్పటివరకు సాధించలేకపోయింది ముంబై ఇండియన్స్. దీంతో ఇక రోహిత్ కెప్టెన్సీ మార్పు ఫై వస్తున్న విమర్శలు మరింత తీవ్రతరం అయ్యాయి అని చెప్పాలి. ఒకరకంగా హార్దిక్ పాండ్యా రోహిత్ అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో నెగెటివిటీని ఎదుర్కొంటున్నారు. కాగా ఇదే విషయంపై కొంతమంది మాజీలు కూడా స్పందిస్తున్నారు.
ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల కెప్టెన్సీ వ్యవహారంలో.. జట్టు యాజమాన్యం ఇంకా బెటర్గా వ్యవహరించి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ ఎవరిని కెప్టెన్ చేయాలనేది జట్టు యజమానుల నిర్ణయం. వాళ్లే డబ్బులు ఖర్చు పెడతారు. కాబట్టి అది వాళ్ళ ఇష్టం అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. ఇక ముంబై సారధిగా ఎవరు ఉండాలని స్టార్ స్పోర్ట్స్ ఇటీవల పోలింగ్ నిర్వహించగా మెజారిటీ శాతం ప్రేక్షకులు అటు రోహిత్ శర్మకు ఓటు వేశారు. ఏకంగా 85% ఓట్లు రోహిత్ శర్మకు పడితే.. ఇక 15% మంది మాత్రమే హార్దిక్ ముంబై కెప్టెన్ గా ఉండాలని కోరుకున్నారు.