షాకింగ్ : కెప్టెన్సీ నుంచి తప్పుకున్న పాకిస్తాన్ ప్లేయర్?

praveen
గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది  అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సంక్షోభం నేపథ్యంలో అక్కడ ఎప్పుడూ ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది కూడా ఊహకందని విధంగానే మారిపోయింది. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో విఫలం కావడంతో ఏకంగా బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలి అంటూ డిమాండ్లు వచ్చాయి. అయితే ఇక టోర్నీ నుంచి నిష్క్రమించి పాకిస్తాన్ జట్టు స్వదేశానికి చేరుకుందో లేదో బాబర్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

 ఇంకోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం కోచింగ్ సిబ్బందిపై కూడా వేటు వేసింది. ఆ తర్వాత ఇక పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడం ఇక కొత్త అధ్యక్షుడు రావడం ఇలా ఎప్పుడూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి అని చెప్పాలి. అయితే పాకిస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్లను నియమించిన తర్వాత కూడా ఆ జట్టుకు ఎక్కడ కలిసి రావడం లేదు. వరుసగా ఓటములతో సతమతమవుతూనే ఉంది. దీంతో ఇక ఇప్పుడు పాకిస్తాన్ టీం కి మరోసారి కొత్త కెప్టెన్ రాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

 గతంలో సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న బాబర్ చేతికి మరోసారి కెప్టెన్సీ ని అప్పగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల పాకిస్తాన్ టి20 కెప్టెన్ షాహిన్ షా సారధ్య బాధితుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన కెప్టెన్సీ లో పాకిస్తాన్ ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ ఇలా కెప్టెన్సీ  నుంచి వైదొలగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పిసిబి చైర్మన్ నక్వి కి సమాచారం ఇచ్చాడట. అయితే ఇక టి20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని కెప్టెన్ గా మళ్ళీ బాబర్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: