లక్నోని గెలిపించాడు.. ఇంతకీ ఎవరీ మాయాంక్ యాదవ్?

praveen
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఎందుకో అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. వరుసగా రెండు మ్యాచ్లలో పేలవ ప్రదర్శన చేసి ఓటములు చవిచూసింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఆ జట్టు అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి విజయం సాధించింది లక్నో జట్టు. కెఎల్ రాహుల్ కాకుండా కొత్త కెప్టెన్ పూరన్ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా తిరుగులేని ప్రదర్శన చేసింది అని చెప్పాలి.

 అయితే ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు విషయం సాధించింది అంటే దానికి కారణం ఇక జట్టులోకి ఎంట్రీ ఇచ్చి డెబ్యూ మ్యాచ్ ఆడిన ఫేసర్ మయాంక్ యాదవ్ అని చెప్పాలి. ఎందుకంటే తన అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. పంజాబ్ బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పులు పెట్టాడు అని చెప్పాలి. ఏకంగా నాలుగు ఓవర్లు వేసిన ఈ యువ ఆటగాడు.. 27 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు పడగొట్టి ఇక పంజాబ్ కింగ్స్ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు అని చెప్పాలి. దీంతో అందరూ కూడా అటు ఈ యువ ఆటగాడీ ప్రతిభ గురించి చర్చించుకుంటూ ఉండడం గమనార్హం.

 అయితే మొదటి మ్యాచ్ లోనే ఈ ఐపీఎల్ సీజన్లో పాస్టెస్ట్ బంతిని వేశాడు మయాంక్ యాదవ్. ఏకంగా 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇకపోతే ఈ యువ ఆటగాడు ఎవరు అని తెలుసుకొనేందుకు అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు. కాగా ఈ 21 ఏళ్ళ పేస్ బౌలర్ దేశవాలి క్రికెట్ లో ఢిల్లీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే గత ఏడాది దేవదర్ ట్రోఫీలో ఐదు మ్యాచ్లలో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అయితే మయాంక్ యాదవును కనీస ధర రూ. 20 లక్షలకు లక్నో వేలంలో సొంతం చేసుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: