ఆర్సిబి మాత్రమే కాదు.. ఆ 2 టీమ్స్ కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు తెలుసా?
బెంగళూరు జట్టుకు ఉన్న క్రేజ్ దృశ్య టైటిల్ గెలవని జట్టు ఏది అంటే బెంగళూరు పేరే మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటుంది. దీంతో ఒక్క ఆర్సిబి తప్ప మిగతా అన్ని టీమ్స్ కూడా ఒక్కసారైనా టైటిల్ గెలిచి ఉంటాయి అని ఎంతో మంది ఐపిఎల్ అభిమానులు అనుకుంటూ ఉంటారు. కానీ అచ్చం అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాగానే మరో రెండు టీమ్స్ కూడా ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేకపోయాయి. అవే పంజాబ్ కింగ్స్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు అని చెప్పాలి. ఈ రెండు టీమ్స్ కి కూడా ఆర్సీబీ లాగానే టైటిల్ గెలవడం అనేది ఒక కలగానే మిగిలిపోయింది. ఎంతమంది కెప్టెన్లు మారినా టైటిల్ ఆశ మాత్రం తీయడం లేదు.
ఇప్పుడు వరకు 16 సీజన్లు గడిచిన ఈ మూడు జట్లు ఒక్క టైటిల్ కూడా అందుకోలేదు. ప్రతి సీజన్లో కూడా ఈ మూడు టీమ్స్ ని దురదృష్టం వెంటాడుతూనే ఉంది అని చెప్పాలి. ఇప్పటివరకు పలుమార్లు ఈ మూడు టీమ్స్ ఫైనల్ కు వెళ్లిన.. అక్కడ మాత్రం పరాజయాన్ని చవిచూస్తూ రన్నరఫ్ తోనే సరిపెట్టుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. ఆర్సిబి పరిస్థితి అయితే మరింత విచారకరం. మూడుసార్లు ఫైనల్ కు వెళ్లిన ఒక్కసారి కప్పు గెలవలేకపోయింది. అయితే ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో మాత్రం ఈ మూడు టీమ్స్ తమ తలరాతన మార్చుకొని ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీమ్స్ లిస్టులో చేరాలని అనుకుంటున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.