ఎవరేమనుకున్నా.. బాబర్ కంటే కోహ్లీ గొప్ప ఆటగాడు : ఇమాద్ వసీం

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి.. వరల్డ్ క్రికెట్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటి జనరేషన్ లో ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉంటే.. అందరిలో అత్యుత్తమ ఆటగాళ్లు ఎవరు అని లిస్టు తీస్తే అందులో మొదటి వరుసలో టాప్ లో విరాట్ కోహ్లీ పేరే వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తన ఆట తీరుతో అంతలా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక విరాట్ కోహ్లీకి భారత్ లో ఎలా అయితే అభిమానులు ఉన్నారో.. అటు విదేశాలలో కూడా కోహ్లీ ఆటను ఆస్వాదిస్తూ ఇక వీరాభిమానులుగా మారిన వారు కోట్లలోనే ఉంటారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్ ఏకంగా క్రికెట్ మాజీలు సైతం ఇలా విరాట్ కోహ్లీ ఆటకు మంత్రముగ్ధులు అవుతూ.. ఇక అభిమానులుగా మారిపోతూ ఉంటారు. ఇక ప్రస్తుతం యాక్టివ్ ప్లేయర్లుగా ఉన్నవారు సైతం కోహ్లీ ఆటకు తాము వీరాభిమానులమని అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. అయితే ఇలా అందరూ విరాట్ పై ప్రశంసలు కురిపిస్తే అటు పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం కొన్ని కొన్ని సార్లు విమర్శలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఎవరైనా పాకిస్తాన్ క్రికెటర్లు కోహ్లీ పై ప్రశంసలు కురిపించారు అంటే ఆ దేశ క్రికెట్ ప్రేక్షకులు వారిపై విమర్శలు చేయడం కూడా చూస్తూ ఉంటాం.

 అయితే ఇటీవల ఇదే విషయం గురించి పాకిస్తాన్ స్పిన్నర్ ఇమాద్ వసీం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్. అతన్ని ప్రశంసిస్తే పాకిస్తాన్ అభిమానులు బాధపడుతున్నారు. అయినప్పటికీ నిజం ఏంటంటే విరాట్ కోహ్లీ బాబర్ అజాం కంటే గొప్ప ఆటగాడు అంటూ ఇమాద్ వసీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే ఈ పాకిస్తాన్ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి  పోనీలే పాకిస్తాన్ క్రికెటర్లు ఎలా ఉన్నా నువ్వైనా ఇన్నాళ్లకు నిజం ఒప్పుకున్నావు అంటూ అతని మాటలపై భారత క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: