క్రికెట్ దేవుడు సచిన్ రికార్డు బ్రేక్.. బద్దలు కొట్టింది ఎవరంటే?

praveen
ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఏకంగా క్రికెట్ దేవుడిగా కొనసాగుతూ ఉన్నాడు సచిన్ టెండూల్కర్. అతిపిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ అతి తక్కువ సమయంలోనే.. ఇక వరల్డ్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే భారత జాతీయ జట్టు తరఫున దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే ప్రాతినిధ్యం వహించిన సచిన్ టెండూల్కర్.. ఇక వరల్డ్ క్రికెట్లో సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అయితే 2011లో సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఇప్పటికీ కూడా సచిన్ సాధించిన రికార్డులు ఏ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేకపోయాడు అని చెప్పాలి.

 సచిన్ సాధించిన రికార్డులు ఇంకా పదిలంగా ఉన్నాయి అంటే అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ తన ఆట తీరుతో ఎంతలా ప్రభావితం చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఎవరైనా ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు అంటే చాలు ఇక అతని పేరు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అందరూ అతని ప్రదర్శన గురించే చర్చించుకోవడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఒక యువ ఆటగాడు ఇలా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ముషీర్ ఖాన్ ఏకంగా రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో 136 పరుగుల భారీ సెంచరీ బాదాడు.

 ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో సెంచరీ బాదిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు ముషీర్ ఖాన్. 19 ఏళ్ళ 41 రోజుల వయసులోనే ముషీర్ ఖాన్ ఈ అద్భుతమైన శతకాని సాధించడం గమనార్హం. అంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1994 - 95 సీజన్ లో ఫైనల్లో పంజాబ్ పై రెండు సెంచరీలు బాదాడు సచిన్. అయితే సచిన్ కంటే తక్కువ వయసులోనే ముషీర్ ఖాన్ ఇక ఇప్పుడు మరో భారీ సెంచరీ బాదటం గమనార్హం. దీంతో ఇక బ్లాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డున బద్దలు కొట్టి ఆ రికార్డును తన పేరిట లికించుచుకున్నాడు. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై జట్టు 528 పరుగుల భారీ ఆదిక్యంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: