వైసీపీ మ్యానిఫెస్టోలో ఆ హామీలే అత్యంత కీలకం..?

Suma Kallamadi
వైసీపీ మ్యానిఫెస్టోలో ఆ హామీలే అత్యంత కీలకం?
ఏపీలో ఎన్నికల వేడి ఎండ వేడిమిని తలపిస్తోంది. ఈసారి ఎలాగన్నా అధికారంలోకి రావాలని టీడీపీ కూటమిగా ఏర్పడి బరిలో దిగుతుంటే, మరోసారి అధికారమే లక్ష్యంగా చేసుకున్న వైస్సార్సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోను తాజాగా విడుదల చేసింది. పాత పధకాలు గురించి అందరికీ తెలిసినదే. అయితే ఈసారి ప్రస్తుత పథకాలను కొనసాగిస్తూనే వాటిని విస్తరిస్తూ.. వాటి ప్లేసులో మరిన్ని పధకాలను చేర్చడం జరిగింది. 2019 ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో విడుదల చేయగా.. ఈ 2024 ఎన్నికలకు 'సామాజిక భద్రత' పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది వైసీపీ. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది.
గతంలో ఇచ్చిన హామీలు 100 శాతం అమలు చేశామని చెబుతూనే ఇప్పుడు మరింతగా ప్రజలకు మేలు చేసే దిశగా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ 'సూపర్‌ సిక్స్‌' మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు చేశారు జగన్. చంద్రబాబుకి కనీసం కొత్త పథకాలే దొరకలేదా? మా నవరత్నాలను అటు ఇటు చేసి సూపర్ సిక్స్ అంటున్నారు అని ఎద్దేవా చేసారు. ఇకపోతే వైసీపీ ఈ సందర్భంగా జనాలకు సంక్షేమం పేరిట గతంలో ఇచ్చిన దాని కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని పేర్కొంది. సంక్షేమ మంత్రమే గెలిపిస్తుందనే ధీమాలో జగన్‌ ఉన్నారు. వచ్చే ఐదేళ్లు ఇలాగే సంక్షేమం కొనసాగిస్తాం అనే సూత్రంతో వైఎస్సార్‌సీపీ తన మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది.
2024 వైసీపీ కీలక హామీలు:
1. వైఎస్సార్ చేయూత (45పై బడ్డ వయస్సు కలిగిన మహిళలకు) రూ.75 వేల నుంచి రూ.లక్షా యాభై వేలకు పెంపుదల.
2. వైఎస్సార్ కాపు నేస్తం  రూ.60 వేల నుంచి రూ.లక్షా 20 వేలకు పెంచింది. అదేవిధంగా ఓబీసీ నేస్తం రూ. లక్షా 20 వేలకు పెంపుదల.
3. అమ్మఒడి విషయానికొస్తే రూ.15 వేల నుంచి 17 వేలకు పెంపు (75% హాజరు తప్పనిసరి)
4. వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాల కింద పొదుపు సంస్థలకు ఐదేళ్లకు రూ.3 లక్షలు ఇవ్వబడుతుంది.
5. కల్యాణమస్తు.. షాదీ తోఫా కొనసాగింపు (పదో తరగతి పాస్ కావడం తప్పనిసరి)
6. పేదలకు ఇళ్ల పట్టాలు కొనసాగింపు
7. పట్టణాలలో ఉండే మధ్య తరగతి ప్రజల కోసం పట్టణ గృహ నిర్మాణ పథకం అమలు. ఈ పథకం కింద ప్రతీ ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయింపు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: