ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో.. చరిత్ర సృష్టించిన ఆర్సిబి ప్లేయర్?

praveen
మహిళ క్రికెట్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ని ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతి ఏడాది మొదటిసారి ఇలా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహించగా.. ఎంతలా సూపర్ సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ లీగ్ ద్వారా ఎంతో మంది యంగ్ ప్లేయర్లకు కూడా అవకాశం దక్కింది  అంతేకాదు ఇక మహిళా క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారికి భారీ ధర కూడా దక్కడం గమనార్హం. అయితే ఇక ఇప్పుడు రెండో సీజన్ కూడా ఇలాగే ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అన్న విషయం తెలిసిందే.

 గత కొన్ని రోజుల నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అలరిస్తూ వచ్చిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. ప్రస్తుతం ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్లే ఆఫ్ కి వెళ్ళబోయే నాలుగు జట్లు ఏవి అనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఈసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్న ఎంతమంది ప్లేయర్లు.. అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకుంటున్నారు. కాగా ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న ఆల్రౌండర్ ఎల్లీస్ పెర్రి చరిత్ర సృష్టించింది.

 కాగా ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఘనవిజయాన్ని అందుకున్న బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కి అర్హత సాధించింది అన్న విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ లో ఎల్లిస్ పెర్రి అద్భుతమైన ప్రదర్శన చేసింది  ఏకంగా 6/15 వికెట్లు పడగొట్టింది అని చెప్పాలి. దీంతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన క్రీడాకారిణిగా పెర్రి రికార్డు సృష్టించింది అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ రికార్డు మారి జాన్ కాప్ (5/15) పేరిట ఉండేది. ఇక ప్రస్తుతం ఈ రికార్డును ఎల్లిస్ పెర్రి బ్రేక్ చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: