అవకాశాల్లేక.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో పోటీ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఎప్పటికప్పుడు కొత్త ప్రతిభ తెర మీదికి వస్తూనే ఉంది. ఎప్పుడు ఎవరికి చోటు దక్కుతుంది అన్నది కూడా ఊహకందని విధంగానే మారిపోయింది. అయితే ఇక ఇటీవల కాలంలో ఎవరైనా సీనియర్ ప్లేయర్ రెండు మూడు మ్యాచ్లలో బాగా రాణించలేదు అంటే చాలు సెలెక్టర్లు నిర్మొహమాటంగా వారిని పక్కన పెట్టి యువ ఆటగాళ్లకు ఛాన్సులు ఇస్తూ ఉన్నారు. దీంతో ఒకప్పుడు స్టార్ ప్లేయర్లుగా టీమిండియాలో హవా నడిపించిన ఆటగాళ్లు సైతం ఇక ఇప్పుడు సరైన అవకాశాలు దొరక్క క్రికెట్లో కనుమరుగు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

 అయితే ఇలా ఒకప్పుడు స్టార్ ప్లేయర్లుగా హవా నడిపించిన వారి పరిస్థితే ఇలా ఉంటే ఇక అప్పట్లోనే టీమిండియాలో అడపాదడపా అవకాశాలు దక్కించుకున్న ఇంకొంతమంది ప్లేయర్లకు మాత్రం ఇక టీమిండియా ఛాన్స్ లపై దాదాపు ఆశలు వదిలేసుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది క్రికెటర్లు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉన్నారు. కాగా మొన్నటికి మొన్న ఏకంగా ఐదుగురు క్రికెటర్లు ఇలా వీడ్కోలు పలకగా.. ఇక ఇప్పుడు మరో 34 ఏళ్ళ మరో క్రికెటర్ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత క్రికెటర్ షాబాజ్ నాదీమ్ (34) ఆటకి వీడ్కోలు పలికాడు.

 స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన శాబాజ్ నదిమ్ భారత జట్టు తరఫున రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇక మొత్తంగా 140 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 542 వికెట్లు తీశాడు. జార్ఖండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు కూడా సృష్టించాడు. ఇక క్యాష్ రిచ్ లీగ్ గా పిలుచుకునే ఐపిఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ హైదరాబాద్ లక్నో జట్ల తరఫున కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ లో 72 మ్యాచ్లు ఆడిన ఇతగాడు 48 వికెట్లు పడగొట్టాడు. అయితే సరైన అవకాశాలు లేకపోవడంతోనే అతను రిటైర్మెంట్ ప్రకటించాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: