అయోమయంలో ధోని.. ఆ ముగ్గురు ప్లేయర్లు దూరం?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగించింది అన్న విషయం తెలిసిందే. ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా కూడా నిలిచింది. మిగతా అన్ని టీమ్స్ తో పోల్చి చూస్తే ఎక్కువసార్లు ఫైనల్ కు చేరుకున్న జట్టుగా.. ఇక ఎక్కువసార్లు ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిన జట్టుగా కూడా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించింది అని చెప్పాలి.

 ప్రతి ఏడాది ఐపిఎల్ సీజన్ లో కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఇక 2023 ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఏకంగా టైటిల్ విజేతగా కూడా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి మరోసారి టైటిల్ ఎగరేసుకుపోవడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. అయితే గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఎంతోమంది ప్రతిభగల ఆటగాళ్లను జట్టులో చేర్చుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరింత పటిష్టంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 కాగా మార్చి 22వ తేదీ నుంచి అటు ipl ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే బీసీసీఐ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ క్రమంలోనే అటు టైటిల్ గెలవడమే లక్ష్యంగా ప్రణాలిక బద్ధంగా ముందుకు సాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కి ఐపీఎల్ ప్రారంభానికి ముందు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టు ఆల్ రౌండర్  శివం దుబే గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడు చెన్నై ఓపెనర్ డేవిడ్ కాన్వే తో పాటు ఇక భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కూడా గాయాల బారిన పడ్డారు. ఎడమ కాలి నొప్పితో ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అటు రచిన్ రవీంద్ర జట్టుకు దూరమయ్యాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో కాన్వే గాయపడ్డారు. అయితే ఇద్దరు ప్లేయర్లు ఐపీఎల్ ప్రారంభమయ్యే లోపు కోలుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: