అల్లు అర్జున్ – రేవంత్ రెడ్డి.. అసలు ఏం జరుగుతోంది?
అల్లు శిరీష్ పెళ్లి వేడుకకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డిని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాదరంగా ఆహ్వానించారు. వేదికపైకి రాగానే రేవంత్ రెడ్డిని బన్నీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. చాలా సేపు ఒకరి భుజంపై ఒకరు చేయి వేసుకుని నవ్వుతూ ముచ్చటించారు.వీరిద్దరూ ఎంతో సాన్నిహిత్యంగా మాట్లాడుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "చూస్తుంటే ఇక్కడ ఎలాంటి గొడవలు లేవు.. అంతా క్లియర్" అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత రేవంత్ రెడ్డి - అల్లు అర్జున్ మధ్య గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. "ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు లేవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని స్పష్టత ఇచ్చారు.అల్లు అర్జున్ కూడా వివాదాలకు వెళ్లకుండా చట్టాన్ని గౌరవిస్తానని చెప్పి సైలెంట్ గా ఉన్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి కనిపించడంతో, ఆ ఘటన చుట్టూ జరిగిన ప్రచారం కేవలం రూమర్ మాత్రమేనని తేలిపోయింది.
బన్నీ - రేవంత్ రెడ్డి క్లోజ్ బాండింగ్.. అల్లు శిరీష్ పెళ్లిలో ఈ సీన్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. రాజకీయాలు ఎలా ఉన్నా, ఫ్యామిలీ ఈవెంట్లలో అందరూ ఒక్కటై సందడి చేయడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.సాధారణంగా నాయకులు, స్టార్లు కలిసినప్పుడు ఫార్మల్ గా ఉంటారు. కానీ రేవంత్ - బన్నీ మధ్య కనిపించిన ఆ సాన్నిహిత్యం మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుందని అతిథులు అభిప్రాయపడుతున్నారు.రేవంత్-బన్నీల మధ్య బాండింగ్ చూస్తుంటే ముందు ముందు వీరి మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా కనిపిస్తున్నాయి.