చెన్నై సూపర్ కింగ్స్ లో.. ధోని పారితోషకం ఎలా ఉందంటే?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక ఇండియాలో ఒక క్రికెట్ పండుగగా కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభమైంది అంటే చాలు ఇక క్రికెట్ లవర్స్ అందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతూ ఉంటుంది. ఇక ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ పిచ్చోళ్ళ లాగా మారిపోతూ ఉంటారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రతి ఆటగాడు కూడా ఎప్పుడు ఏ జట్టు తరపున ఆడతాడు అని ఊహించడం చాలా కష్టం  కానీ కొంతమంది ప్లేయర్లు మాత్రం ఇక ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి ఒకే జట్టు తరఫున ఆడటం చేస్తూ ఉంటారు. అలాంటి ప్లేయర్లలో మహేంద్ర సింగ్ ధోని కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.

 టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. దాదాపు గత 16 ఏళ్ల నుంచి కూడా చెన్నై జట్టులోనే కొనసాగుతూ ఉన్నాడు ధోని. ఈ క్రమంలోనే కెప్టెన్గా ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని చాంపియన్గా నిలిపాడు అని చెప్పాలి. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ కూడా అందించాడు ధోని. అయితే ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఎంతోమంది స్టార్ ప్లేయర్లు వచ్చారు పోయారు తప్ప ధోని మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ని అంటిపెట్టుకొని ఉన్నాడు. అయితే ప్రస్తుతం ధోని ఒక్కో ఐపీఎల్ సీజన్ కి 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే గత పదహారేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ లో కొనసాగిన కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోని.. రెమ్యూనరేషన్ విషయంలో జరిగిన మార్పుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. అయితే ఐపీఎల్ 2008 వేలంలో మహేంద్రసింగ్ ధోనిని 1.5 మిలియన్ డాలర్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ 2010 వరకు కూడా ధోని కి ఇదే పారితోషకం కొనసాగింది. 2011 - 13 సీజన్ వరకు 1.8 మిలియన్ డాలర్లను పారితోషకంగా అందించింది జట్టు యాజమాన్యం. 2014 నుంచి 2017 సీజన్ వరకు 12 కోట్లు పారితోషకం అందుకున్నాడు. 2018 నుంచి 2021 మధ్యలో15 కోట్లు అందుకున్న ధోని 2022 ఐపీఎస్సీ నుంచి 12 కోట్లు తీసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: