అద్భుతం.. 73 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన రోహిత్ శర్మ?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు కెప్టెన్గా ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూనే మరోవైపు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా అదరగొట్టేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లలో పెద్దగా బ్యాటింగ్తో ఆకట్టుకోలేకపోయాడు. కానీ మూడో టెస్ట్ మ్యాచ్లో మాత్రం ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. అతి తక్కువ పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమ్ ఇండియా కష్టాల్లో ఉన్న సమయంలో రోహిత్ దాటిగా బ్యాటింగ్ చేశాడు.

 సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి ఏకంగా సెంచరీ తో కదం తొక్కాడు అని చెప్పాలి. అతను సెంచరీ తో ఇక టీమ్ ఇండియాకు గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది. ఇక రోహిత్ మళ్లీ సెంచరీ చేసి ఫామ్ లోకి రావడంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇలా సెంచరీ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 73 ఏళ్ల రికార్డును బదులు కొట్టాడు. భారత క్రికెట్ చరిత్రలో దిగజంగా కొనసాగుతున్న విజయ్ హజారే సాధించిన రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్ శర్మ. ఇంటర్నేషనల్ క్రికెట్లో అతిపెద్ద వయసులో సెంచరీ చేసిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ప్రస్తుతం 36 ఏళ్ల 291 రోజుల వయసులో సెంచరీ చేశాడు రోహిత్.

 ఇదివరకు ఈ రికార్డు విజయ్ హజారే పేరిట ఉండేది. విజయ్ హజారే 1951 లో ఇదే ఇంగ్లాండు జట్టుపై 36 ఏళ్ల 278 రోజుల వయస్సులో 155 పరుగులు చేసి సెంచరీ తో చెలరేగిపోయారు. ఇప్పటివరకు ఇదే భారత కెప్టెన్ గా అతిపెద్ద వయసులో చేసిన సెంచరీగా కొనసాగింది. ఇక ఇప్పుడు కెప్టెన్ గా రోహిత్ శర్మ సెంచరీ తో చెలరేగిపోయి ఈ 73 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టాడు అని చెప్పాలి. కాగా మ్యాచ్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 445 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలోనే భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ప్రస్తుతం తమ ఆటను కొనసాగిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: