సూపర్ సెంచరీ.. రోహిత్ శర్మ అరుదైన రికార్డ్?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ లో సృష్టించే విధ్వంసం గురించి భారత క్రికెట్ పరీక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్ శర్మ ఇక టీమ్ ఇండియాకు అద్వితీయమైన విజయాలు అందించాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు జట్టును కెప్టెన్ గా ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూనే ఇంకోవైపు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా తనకు తిరుగులేదు అనిపిస్తున్నాడు రోహిత్ శర్మ.

 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్యంలో  అటు భారత జట్టు విన్నింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లు ముగిసాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మూడో టెస్ట్ మ్యాచ్లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడాడు. తక్కువ పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయిన సమయంలో అతను క్రీజులో నిలబడి శతకంతో చలరేగిపోయాడు.

 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలోకి వచ్చేసాడు. 18,577 పరుగులతో 4 స్థానంలో నిలిచాడు. అతనికంటే ముందు సచిన్ 34,357, కోహ్లీ 26,733, రాహుల్ ద్రావిడ్ 24280 పరుగులతో ఉన్నారు అని చెప్పాలి. అలాగే టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాధిన బ్యాట్స్మెన్లలో ధోని 78 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టి ఇక 79 సిక్సర్లతో రోహిత్ శర్మ ఇక రెండో స్థానంలోకి చేరుకున్నాడు అని చెప్పాలి. ఇక ఈ లిస్టులో టీమిండియా మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సర్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: