అండర్ 19 వరల్డ్ కప్ : బీసీసీఐఫై అలాంటి ఆరోపణలు సరికాదంటున్న గంగూలీ?

praveen
ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఏకంగా ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి ప్రతి ఏడాది ఎక్కువ ఫండ్స్ ఇచ్చేది కూడా బీసీసీఐ కావడం గమనార్హం. అయితే అటు ఐసీసీ కూడా బీసీసీఐ కనుసన్నల్లోనే  నడుస్తుంది అని  అంతర్జాతీయ క్రికెట్లో ఒక టాక్ కూడా ఉంది. ఇకపోతే అటు ఇలా రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతున్న బీసీసీఐ ప్రపంచకప్ టోర్నీలకు  ఆతిథ్యం ఇవ్వడానికి ఎప్పుడు ఆసక్తి చూపిస్తూ ఉంటుంది.

 అయితే ఇప్పుడు వరకు ఎన్నోసార్లు అటు ప్రపంచకప్ టోర్నీలకు  ఆతిథ్యం ఇచ్చింది బీసీసీఐ. కానీ ఒక్కసారి కూడా అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వకపోవడం గమనార్హం. అయితే ఇక అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీ కారణంగా ఎక్కువ ఆదాయం రాదు. కాబట్టి బీసీసీఐ ఇక ఈ కుర్రాల్ల ప్రపంచకప్ టోర్ని అటు ఇండియా వేదికగా నిర్వహించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు  అని ఎంతో మంది కొన్ని ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి ఆరోపణలపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఇప్పుడు వరకు అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ దే పైచేయిగా కొనసాగుతుంది. ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన అండర్ 19 టీమ్ ఇండియా.. 9 సార్లు ఫైనల్ వరకు చేరుకుంది. ఇప్పుడు వరకు ఇండియాలో ఒక్కసారి కూడా ప్రపంచకప్  జరగలేదు. ఈ విషయంపై గంగూలీ స్పందిస్తూ అండర్ 19 మ్యాచ్ లకు ఆదాయం రాదు కాబట్టి ఇండియాలో నిర్వహించడం లేదు అన్న వాదన సరికాదు.  సీనియర్ వరల్డ్ కప్ లో చాలా మ్యాచ్ లు ఆదాయం లేకపోయినా ఇండియాలో నిర్వహిస్తున్నారు. మనం నిర్వహించకపోతే వేరే దేశంలో జరుగుతుంది. తద్వారా క్రికెట్ విస్తరించేందుకు అవకాశం ఉంది అంటూ సౌరబ్ గంగూలి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: