ఆస్ట్రేలియా పై మనదే పైచేయి.. హ్యాట్రిక్ పై కన్నేసిన టీమిండియా?

praveen
జూన్ 1వ తేదీ నుంచి సీనియర్ల టి20 వరల్డ్ కప్ ప్రేక్షకులను అలరించబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందే ఇప్పుడు కుర్రాళ్ల వరల్డ్ కప్ కూడా కొన్ని రోజుల నుంచి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న ప్రతి మ్యాచ్ కూడా ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందించింది. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ దూసుకోవచ్చిన ఆస్ట్రేలియా టీమిండియా జట్లు ఫైనల్లో తలబడేందుకు సిద్ధమయ్యాయి.

 ఇలా ఏవైనా రెండు టీమ్స్ వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ వరకు చేరుకున్నాయి అంటే చాలు ఈ రెండు టీమ్స్ మధ్య గతంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లలో ఘనాంకాలు ఏంటి అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే గత కొంతకాలం నుంచి ఐసీసీ ఫైనల్స్ లో అటు భారత జట్టును ఓడిస్తూనే వస్తుంది ఆస్ట్రేలియా టీం.

 అయితే ఇప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ కూడా వరుసగా ముచ్చటగా మూడోసారి టీమిండియ, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య గత గణాంకాలు ఎలా ఉన్నాయి అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే అండర్ 19 ప్రపంచ కప్ లో మాత్రం అటు టీమిండియాదే ఫైచేయిగా కొనసాగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఇరు జట్లు రెండుసార్లు అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో తలబడ్డాయి. అయితే ఈ రెండు సార్లు కూడా భారత కుర్రాళ్లే విజేతలుగా నిలిచారు. ఇక ఇప్పుడు మూడోసారి ఈ రెండు టీమ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. దీంతో ఆస్ట్రేలియా పై హ్యాట్రిక్ కొట్టాలని కుర్రాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాగా అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటివరకు భారత జట్టు ఏకంగా ఐదుసార్లు ఫైనల్ కు చేరుకొని రికార్డు సృష్టించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: