ఏం టాలెంట్ గురూ.. ఒకేసారి పదిమందిని ఓడించాడు?

praveen
సాధారణంగా ప్రస్తుతం ఎన్నో రకాల క్రీడల్లో చాలామంది ప్రావీణ్యం సాధించి గుర్తింపును అందుకున్నారు. ఇక ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ అత్యంత కష్టమైన గేమ్ ఏది అంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా చెస్ అని చెప్పేస్తుంటారు. ఎందుకంటే చూసేవారికి ఎంతో సింపుల్ గా అనిపిస్తుంది. కానీ ఆడే వారికి మాత్రం చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. చెస్ గేమ్ లో వేసే ప్రతి మూవ్లో కూడా మైండ్ 100 వేగంతో పరుగులు పెట్టాల్సి ఉంటుంది. ఇక ప్రత్యర్థి మైండ్ ని కూడా చదవాల్సి ఉంటుంది   ఒకే చోట కూర్చుని ఆడే గేమ్ అయినప్పటికీ ఇక చెస్ అనేది ఎంతో కష్టమైనది అని చెప్పాలి.

 అందుకే చదరంగం ఆటలో ఎవరైనా గెలిచారు అంటే చాలు ఇక వారిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువ కురుస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా చెస్ గేమ్ లో ఒకరితో ఆడి గెలవడమే చాలా కష్టం. ఎందుకంటే ఈ ఆటలో ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ఎప్పుడు ఎలాంటి మూవ్ తో చెక్ పెట్టేస్తాడు అన్నది కూడా ఊహించడం కష్టమే. అలాంటిది ఏకంగా ఒకే సమయంలో పది మందితో చెస్ ఆడటం అంటే మామూలు విషయమా పదిమందితో ఆడి పది గేమ్స్ లో కూడా విజయం సాధించడం అంటే అది ఆలోచించనల్లో కూడా అసాధ్యం అనిపిస్తూ ఉంటుంది.

 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఇలాంటిదే చేసి చూపించాడు. ఒకరితో ఆడి గెలిస్తే ఇక కిక్ ఏముంటుంది అనుకున్నాడో ఏమో.. ఏకంగా ఒకేసారి పదిమందితో చేసి గేమ్ ఆడి విజయం సాధించాడు. నైజీరియా కు చెందిన తుండి వొనకోయ అనే చెస్ ఆటగాడు ఏకకాలంలో పదిమంది ఆటగాళ్లతో చెస్ ఆడి అందరిని కూడా ఓడించాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. డి.ఎస్.డి కాన్ఫరెన్స్ లో పదిమందితో ఒకేసారి చెస్ ఆడాను. రెండు గంటల పోరాటం అనంతరం అన్ని గెలిచాను. మా అకాడమీలో కనీసం వంద మంది పేద పిల్లలను చదివించేందుకు డబ్బును సంపాదించగలిగాను అంటూ తుండి వనకోయ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: