ప్రత్యర్థి టీంలో కొత్త స్పిన్నర్ ఉంటే.. టీమిండియా దాసోహమే?

praveen
గత కొంతకాలం నుంచి వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతున్న టీమిండియా సూపర్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనకు వెళ్లిన లేదంటే స్వదేశీ పర్యటనకు వచ్చిన విదేశీ జట్టుతో సిరిస్ ఆడిన కూడా భారత జట్టుదే ఆధిపత్యం అన్నట్లుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. అయితే ఇటీవల ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత జట్టు ఊహించని రీతిలో మొదటి అడుగులోనే తడబడింది. ఏకంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు 28 పరుగుల తేడాతో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే.

 అయితే మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు పరవాలేదు అనిపించినప్పటికీ.. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం టీమిండియా పూర్తిగా తేలిపోయింది.  జట్టులో ఎంతో మంది స్టార్ బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టు మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోవడానికి టీమిండియా ఫ్యాన్స్ ఎవరూ కూడా కాస్తైనా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా ఆట తీరు ఎలా సాగింది అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు.

 ఈ క్రమంలోనే  ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ హార్ట్ లీ ఏకంగా ఏడు వికెట్లు తీసి టీమిండియా ఓటమిని శాసించాడు  అయితే ప్రత్యర్థి టీం లో కొత్త స్పిన్నర్ కు దాసోహం అవడం టీమిండియా కు ఎప్పటి నుంచి అలవాటే అంటూ కొత్త విషయాన్ని తెరమీదకి తీసుకొచ్చారట. గత ఏడాది ఆస్ట్రేలియా స్పిన్నర్  ముర్ఫీకి 7 వికెట్లు, 2008లో స్వదేశంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ జాసన్ క్రేజాకు, కొలంబోలో శ్రీలంక స్పిన్నర్ మొండిస్ కు చేరో ఎనిమిది వికెట్లు ఇచ్చారు  2000లో దాఖలు బంగ్లదేశ్ స్పిన్నర్ నయమూర్ రెహ్మన్ కు  ఆరు వికెట్లు సమర్పించుకుంది. ఇలా ప్రత్యర్థి  టీం లోకి ఎవరైనా కొత్త స్పిన్నర్ వచ్చారు అంటే ఇక టీమిండియా వికెట్లు సమర్పించుకుంటూ పూర్తిగా దాసోహం అవుతుంది అంటూ ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: