ధోని ఐపిఎల్ కెరియర్ పై.. చెన్నై ప్లేయర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
అయితే 2019లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు మహేంద్రసింగ్ ధోని. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఐపీఎల్ కు సైతం ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అంటూ ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ ధోని మాత్రం ఇలాంటి వార్తలను కొట్టి పారేసే విధంగా ప్రతి సీజన్లో కూడా అదరగొడుతూనే వస్తున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహేంద్రసింగ్ ధోనీ భవితవ్యంఫై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.
అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని కనీసం మరో రెండు మూడు ఏళ్ల పాటు ఆడాలని ఆ జట్టు ఆటగాడు దీపక్ చాహార్ పేర్కొన్నాడు. అతను ఇంకా క్రికెట్ కు చాలా సేవ చేయొచ్చు. మరో మూడేళ్లు ఆడగలరు. నెట్స్ లో బ్యాటింగ్ ఎలా చేస్తున్నారో చూస్తున్నాం ఇక గాయం విషయానికి వస్తే క్రికెటర్లకు ఇవన్నీ సహజమే. ఆయన ప్రస్తుతం పూర్తిగా కోరుకున్నారు అంటూ దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు. అయితే ఆడాలా వద్దా అన్నది పూర్తిగా ఆయన ఇష్టమే. కానీ ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడటం చాలా కష్టంగా ఉంటుంది అంటూ చాహార్ ధోనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు .