అటు వెస్టిండీస్.. ఇటు సౌత్ ఆఫ్రికా.. ఆస్ట్రేలియాను చిత్తు చేశాయిగా?

praveen
వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్లలో టాప్ లో కొనసాగుతూ ఉంటుంది ఆస్ట్రేలియా. ఎలాంటి ఫార్మాట్లో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అత్యుత్తమ ప్రదర్శన చేసి ప్రత్యర్థులను ఓడించడంలో అటు ఆస్ట్రేలియా జట్టు దిట్ట అని చెప్పాలి. అందుకే ఏ టీమ్ అయినా సరే ఆస్ట్రేలియా తో మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు కాస్త ప్రత్యేకంగా వ్యూహాలను రచించడం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని టీమ్స్ అయితే ఏళ్ల తరబడి కూడా ఆస్ట్రేలియా జట్టుపై ఒక్కసారి కూడా విజయం సాధించలేక చెత్త రికార్డులు మూట గట్టుకుంటున్నాయి  అలాంటిది ఇటీవలే ఏకంగా ఆస్ట్రేలియా జట్టుపై రెండు టీమ్స్ ఘనవిజయాలను సాధించాయి అని చెప్పాలి.

 ప్రస్తుతం ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది. అయితే ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాను ఒక్కసారి కూడా ఓడించలేదు. అయితే ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అసమాన్యమైన ఆటతీరుతో మొదటిసారి గబ్బ స్టేడియంలో ఆస్ట్రేలియాను ఓడించి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది వెస్టిండీస్ జట్టు. దీంతో క్రికెట్ ప్రపంచం మొత్తం దీని గురించి చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.

 ఇక మరోవైపు ఆస్ట్రేలియా మహిళలు జట్టును కూడా ఎప్పుడు ఓడించని ఒక టీం ఓడించి ఘన విజయాన్ని అందుకుంది. సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు ఇటీవల ఆస్ట్రేలియాని ఓడించి చరిత్ర సృష్టించింది. ఇంటర్నేషనల్ క్రికెట్లో తొలిసారి ఆస్ట్రేలియా జట్టును ఓడించింది సౌత్ ఆఫ్రికా. ఇటీవల జరిగిన టి20 మ్యాచ్ లో తొలుత ఆస్ట్రేలియా 142/ 6 స్కోర్ చేయగా.. సౌత్ ఆఫ్రికా కేవలం 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. అయితే ఇరు ఎట్ల మధ్య ఇప్పటివరకు 15 వన్డే మ్యాచ్ లు జరిగాయి. అయితే ఓక వన్డే టై గా ముగియగా.  మిగతా మ్యాచ్లలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 9 t20 లు జరగగా.. 8 t20 మ్యాచ్లలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక ఇటీవల జరిగిన మ్యాచ్లో మొదటిసారి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: