మొదటి టెస్టులో ఓటమి.. WTC టేబుల్ లో టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే?

praveen
గత కొంతకాలం నుంచి వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది టీమిండియా. ఈ క్రమంలోనే ప్రత్యర్థి  జట్టును చిత్తు చేస్తూ  వరుస విజయాలు సాధిస్తూ సత్తా చాటుతూ ఉంది అని చెప్పాలి. ఇలా వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమ్ ఇండియాకు ఇటీవల ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో మాత్రం చేదు అనుభవం తప్పలేదు. భారత జట్టుతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ జట్టు ఇండియా పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సిరీస్ లో భాగంగా ఇటీవల హైదరాబాద్ లోనికి ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఉప్పల్ స్టేడియం వేదికగా ఇప్పటివరకు భారత జట్టు ఆడిన ఏ ఒక్క టెస్ట్ మ్యాచ్ లో కూడా ఓటమి చవి చూడలేదు  అజయమైన టీం గా ఉప్పల్ స్టేడియంలో ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది టీం ఇండియా. అయితే ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా భారత జట్టు అలవోకగా విజయం సాధించడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఊహించనీ రీతిలో మొదటి మ్యాచ్ లోనే టీమ్ ఇండియాకు పరాభవం తప్పులేదు. నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా  సాగిన పోరులో ఇంగ్లాండ్ జట్టు భారత జట్టును ఓడించింది. దీంతో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి.

 అయితే ఇలా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన భారత జట్టు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఇండియా 43.32 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది అని చెప్పాలి. అయితే ఇక మొదటి మ్యాచ్లో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు 29.19వ స్థానంలో కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇక భారత్ కంటే ముందు తొలి నాలుగు స్థానాలలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి అని చెప్పాలి. అయితే తర్వాత మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతుంది. టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: